తెలంగాణ: కబడ్డీ పోటీల్లో మరో అపశృతి.. కాలు జారిపడ్డ మంత్రి మల్లారెడ్డి

By Siva KodatiFirst Published Mar 30, 2021, 9:22 PM IST
Highlights

సూర్యాపేటలో కొద్దిరోజుల క్రితం కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘటనను మరిచిపోకముందే.. తెలంగాణలో కబడ్డీ పోటీల వేళ మరో అపశృతి జరిగింది. 

సూర్యాపేటలో కొద్దిరోజుల క్రితం కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘటనను మరిచిపోకముందే.. తెలంగాణలో కబడ్డీ పోటీల వేళ మరో అపశృతి జరిగింది.

హైదరాబాద్ బోడుప్పల్‌లో 68వ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి.. పోటీల సందర్భంగా కబడ్డీ ఆడుతూ కాలు జారి కిందపడ్డారు. అయితే తాను క్షేమంగానే వున్నానని మంత్రి తెలిపారు. 

కాగా, గత సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలిపోయింది.

దీంతో సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

Also Read:జాతీయ గీతం కోసం నిలబడుతుండగానే.... ప్రమాదం: సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశృతి

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. ప్రమాద సమయంలో గ్యాలరీల్లో దాదాపు 1,500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ సైదులు అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. 

click me!