హఫీజ్ పేట్ భూ వివాదం: ఆ భూములు ప్రైవేట్‌వే.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

By Siva KodatiFirst Published Mar 30, 2021, 8:52 PM IST
Highlights

హఫీజ్ పేట్ సర్వే నెంబర్ 80 వివాదాస్పద భూములపై టీఎస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. సర్వే నెంబర్‌లో 80లోని 140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సర్వే నెంబర్ 80లోని భూమి ప్రైవేట్‌దేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. 

హఫీజ్ పేట్ సర్వే నెంబర్ 80 వివాదాస్పద భూములపై టీఎస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. సర్వే నెంబర్‌లో 80లోని 140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సర్వే నెంబర్ 80లోని భూమి ప్రైవేట్‌దేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. పిటిషనర్లకు రూ.4 లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డ్, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

50 ఎకరాలు ప్రవీణ్ రావు, సహ యజమానుల పేరిట నమోదు చేయాలని న్యాయస్థానం తెలిపింది. అయితే హైకోర్ట్ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

హైదరాబాద్‌ చుట్టూ విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూములు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాజకీయంగా పలుకుబడి, అధికారుల అండదండలు సహా కండబలం ఉన్న వాళ్లంతా వాళ్లవాళ్ల స్థాయిలో భూముల చుట్టూ కంచెలు వేసి కబ్జా చేస్తూ వస్తున్నారు.

మరోవైపు. హఫీజ్ పేట భూవివాదమే బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు దారితీసింది.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఈ కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆపై బెయిల్‌పై ఆమె విడుదల వావడం జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక, హైకోర్టు తీర్పు ఇప్పుడు కీలకంగా మారగా.. సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. 
 

click me!