reddy simha garjana: రెడ్లకు టీఆర్ఎస్ చేసిందేంటీ ... మల్లారెడ్డికి నిరసన సెగ, మధ్యలోనే వెనుదిరిగిన మంత్రి

Siva Kodati |  
Published : May 29, 2022, 09:23 PM IST
reddy simha garjana: రెడ్లకు టీఆర్ఎస్ చేసిందేంటీ ... మల్లారెడ్డికి నిరసన సెగ, మధ్యలోనే వెనుదిరిగిన మంత్రి

సారాంశం

మేడ్చల్ జిల్లా  ఘట్‌కేసర్‌లో జరిగిన రెడ్డి సింహాగర్జన సభలో మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ఆయన మాట్లాడుతుండగా రెడ్లకు టీఆర్ఎస్ చేసిందంటూ జనం నిలదీశారు. దీంతో ఆయన మధ్యలోనే వెనుదిరిగారు. 

మేడ్చల్ జిల్లాలో (medchal district) మంత్రి మల్లారెడ్డికి (malla reddy) నిరసన తగిలింది. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్డి సింహగర్జన సభలో మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ సభకు హాజరైన వారు నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌పై బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరిస్తుండగా .. మల్లారెడ్డిని అడ్డుకున్న జనాలు రెడ్లకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. వాగ్వాదం శృతిమించడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్ధితి నెలకొంది. చివరికి సింహగర్జన సభ నుంచి మంత్రి మల్లారెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. 

ఇకపోతే.. రెడ్డి సామాజిక వర్గంపై (reddy community) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాజకీయ పార్టీలకు ఆయన సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్నా.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టాలని సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి.. పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి.. రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు. దానికి ఉదాహరణగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని (ys rajasekhara reddy) చూపారు.

Also Read:రెడ్లకు పగ్గాలిస్తేనే.. పార్టీలకు మనుగడ, వైఎస్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి : రేవంత్ సంచలన వ్యాఖ్యలు

రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు… నష్టపోలేదని ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని.. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రెడ్లు సీఎం, ప్రధాని.. రాష్ట్రపతిని బీసీ, ఎస్సీ వర్గాలు చేశాయంటే మనమీద వారికి వుండే నమ్మకమే కారణమని రేవంత్ అన్నారు.

వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నామని... రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దని ఆయన సూచించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి.. పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి..వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి.
 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?