ఆరోగ్యశ్రీ పరిధి మాది కాదు.. డాక్టర్లపై దాడులేంటీ: ఎన్ఎస్‌యూఐపై మల్లారెడ్డి కోడలు ఆగ్రహం

By Siva KodatiFirst Published May 7, 2021, 5:23 PM IST
Highlights

మల్లారెడ్డి హాస్పిటల్ ముందు ఎన్ఎస్‌యూఐ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. కార్యకర్తలు హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. సురారం చెరువు భూములు కబ్జా చేసి మల్లారెడ్డి ఈ హాస్పిటల్ నిర్మించారని నిరసనకారులు ఆరోపించారు. 

మల్లారెడ్డి హాస్పిటల్‌ను ఉచిత కరోనా ఆసుపత్రిగా మార్చాలంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట పీపీఈ కిట్లు ధరించి ధర్నా చేపట్టారు. అంతేకాకుండా హాస్పిటల్‌లో పనిచేసే సిబ్బంది, విద్యార్ధులకు మధ్య ఘర్షణ జరిగింది.

Also Read:మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట ఎన్‌ఎస్‌యూఐ ధర్నా: అద్దాలు ధ్వంసం

అనంతరం గేటు ఎదుట నిరసన తెలుపుతుండగా వారిని పోలీసులు దుండిగల్ పీఎస్‌కు తరలించారు. మరోవైపు ఎన్ఎస్‌యూఐపై దాడిని తీవ్రంగా ఖండించారు మల్లారెడ్డి కోడలు, ఆసుపత్రి ఎండీ ప్రీతిరెడ్డి.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశం తమ పరిధిలో లేదని ఆమె స్పష్టం చేశారు. అకారణంగా డాక్టర్లపై దాడి ఏంటనీ ప్రీతిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఫ్రీ ట్రీట్‌మెంట్‌కు తాము సిద్ధంగా వున్నామని ఆమె స్పష్టం చేశారు. 

click me!