సొంత నియోజకవర్గానికి కేటీఆర్... బిజెపి, కాంగ్రెస్ నాయకుల అరెస్టులు

Arun Kumar P   | Asianet News
Published : Jun 16, 2021, 11:19 AM IST
సొంత నియోజకవర్గానికి కేటీఆర్... బిజెపి, కాంగ్రెస్ నాయకుల అరెస్టులు

సారాంశం

మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన  బిజెపి, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేపట్టారు.

సిరిసిల్ల: వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన  బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఆయనను అడ్డుకోవడం, నిరసన తెలియజేయవచ్చన్న అనుమానంతో పోలీసులు ముందుస్తు అరెస్టులు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో 8 మంది,  బోయినిపల్లి లో 12 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. 

ఇక కేటీఆర్ పర్యటన విషయానికి వస్తే సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి ప‌నులకు శ్రీకారం చుట్టనున్నారు. మొదట ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్ లో నిరుపేదల కోసం నిర్మించిన  డబుల్ బెడ్రూం ఇళ్లను ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తన తాతయ్య-అమ్మమ్మ జ్షాపకార్థం కొదురుపాకలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నారు. అలాగే కొదురుపాక చౌర‌స్తాలో నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారికి కేటీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే