శుభకార్యంలోనే... అధికార పార్టీ ఎంపిటిసి భర్త దారుణ హత్య

Arun Kumar P   | Asianet News
Published : Jun 16, 2021, 10:34 AM ISTUpdated : Jun 16, 2021, 10:44 AM IST
శుభకార్యంలోనే... అధికార పార్టీ ఎంపిటిసి భర్త దారుణ హత్య

సారాంశం

ఇబ్రంహీంపట్నం మండలకేంద్రానికి చెందిన ఎంపీటీసీ భర్త పడల రాజారెడ్డి(42)ని ఓ శుభకార్యంలో అతి కిరాతకంగా దాడి చేసి చంపారు.

జగిత్యాల: అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎంపిటీసి భర్త దారుణ హత్యకు గురయిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇబ్రంహీంపట్నం మండలకేంద్రానికి చెందిన ఎంపీటీసీ మమత భర్త పడల రాజారెడ్డి(42)ని ఓ శుభకార్యంలో అతి కిరాతకంగా దాడి చేసి చంపారు. పదునైన పారతో మెడపై కొట్టగా రాజారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 

ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం జరిగిన ఓ విందుకు రాజారెడ్డి తమ్ముడు చిన్నరాజారెడ్డితో పాటు రమేష్ అనే వ్యక్తి కూడా హాజరయ్యాడు. వీరిద్దరి మధ్య మద్యం మత్తులో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దింతో అక్కడే ఉన్న పలువురు సముదాయించగా అక్కడితో సద్దుమణిగింది. 

అయితే ఇంటికి చేరుకున్న చిన రాజారెడ్డి తన అన్న రాజారెడ్డి కి గొడవ జరిగిన విషయం తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన రాజారెడ్డి తమ్ముడిని తీసుకుని రమేష్ వద్దకు వెళ్ల గొడవకు దిగాడు. ఇలా మళ్ళీ వివాదం చెలరేగి పరస్పరం తీవ్రంగా కొట్టుకున్నారు. దింతో  క్షణికావేశంలో ఎంపిటిసి భర్త రాజారెడ్డి పై రమేష్ తో పాటు మరికొందరు పారతో దాడికి పాల్పడ్డారు. దింతో రాజారెడ్డి తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు వదిలాడు.  

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  దాడికి పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే