200 ఎకరాల్లో 15,660 డబుల్ బెడ్ రూం ఇండ్లు, పరిశీలించిన కేటీఆర్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 11, 2018, 2:37 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఆశ్రమం కల్పించాలన్న ఉద్దేశ్యంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తవగా, మరికొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇలా హైదరాబాద్ శివారులోని కొల్లూరులో దాదాపు 200 వందల ఎకరాల్లో జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాకంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. 

ఈ మెగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పురొగతిని పురపాలక, పట్టణాభివృద్ది మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనీఖీ చేపట్టారు. పనులకు పరిశీలించిన మంత్రి అధికారులతో సమావేశమై తగు సూచనలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని సూచించారు. 

214 ఎకరాల్లో ఒకే చోట 15,600 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది.  నిరుపేద ల‌బ్దిదారుల కోసం రూ. 1354.59 కోట్ల వ్య‌యంతో ఈ నిర్మాణాలను చేపట్టింది. మొత్తం 117 హౌజింగ్ బ్లాకుల్లో ఎస్+9, ఎస్‌+10, ఎస్‌+11 అంత‌స్థుల్లో నిర్మించనున్న ఈ కాల‌నీని దేశంలోనే ఆద‌ర్శ‌వంతంగా ఉండేలా నిర్మిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మ‌రెక్క‌డా లేని ఆధునిక సౌక‌ర్యాల‌తో మోడ‌ల్ సిటీని ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

వీడియో

"

click me!