రూ.9కే చీర.. దక్కించుకునేందుకు కుస్తీల పడ్డ మహిళలు

Published : Aug 07, 2018, 03:21 PM IST
రూ.9కే చీర.. దక్కించుకునేందుకు కుస్తీల పడ్డ మహిళలు

సారాంశం

అసలే శ్రావణ మాసం.. మగువలు మెచ్చే చీరలపై అనేక ఆఫర్లు ప్రకటించి వారిని ఆకర్షిస్తాయి టెక్స్‌టైల్స్ షాపులు. అయితే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఓ దుకాణం ప్రకటించిన ఆఫర్ మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. 

అసలే శ్రావణ మాసం.. మగువలు మెచ్చే చీరలపై అనేక ఆఫర్లు ప్రకటించి వారిని ఆకర్షిస్తాయి టెక్స్‌టైల్స్ షాపులు. అయితే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఓ దుకాణం ప్రకటించిన ఆఫర్ మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ వస్త్ర దుకాణం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని రూ.9కే చీరంటూ కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో మహిళలంతా అక్కడికి పరుగులు తీశారు.

తెల్లవారుజాము నుంచే దుకాణం ముందు క్యూకట్టారు. అనంతరం షాప్ తెరవగానే చీరలను సొంతం చేసుకునేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో తోపులాట  జరిగింది. దీంతో కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వీరిని అదుపు చేయలేక పోయిన దుకాణ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో.. మహిళా పోలీసులు మహిళలను అదుపు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu