అదే జరిగితే.. సోషల్ మీడియాకు దూరమౌతా.. కేటీఆర్

By telugu news teamFirst Published May 26, 2021, 9:46 AM IST
Highlights

ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా యాప్స్ పోగా.. ఇప్పుడు ఇవి కూడా పోతాయా అని కంగారు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇదే విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ ని స్పందించగా.. ఆయన చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.

భారత్ లో ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ బంద్ కానున్నాయంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ నేపథ్యంలో.. ఈ సోషల్ మీడియా దిగ్గజాలపై వేటు పడనుందనేది దాని సారాంశం. కేంద్రం పెట్టిన రూల్స్ కి ఆ సోషల్ మీడియా దిగ్గజాలు ఒప్పుకుంటే ఓకే.. లేదంటే.. భారత్ లో అవి ఇక కనిపించకుండా పోనున్నాయి.  ఈరూల్స్ నేటి నుంచి అంటే మే 26వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో.. చాలా మంది కంగారుపడుతున్నారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా యాప్స్ పోగా.. ఇప్పుడు ఇవి కూడా పోతాయా అని కంగారు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇదే విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ ని స్పందించగా.. ఆయన చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.

 

I may just exit social media if that happens https://t.co/nFApCP7BMq

— KTR (@KTRTRS)

హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ చేసే వ్యక్తి ఒకరు..  ట్విట్టర్ బ్యాన్ అయితే.. ఏం చేస్తారు సర్..? మిమ్మల్ని ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో కలుసుకోవచ్చు అని కేటీఆర్ ని ప్రశ్నించారు.

కాగా.. దానికి ఆయన.. ట్విట్టర్ కనుక బ్యాన్ అయితే.. తాను పూర్తిగా సోషల్ మీడియాకు దూరమౌతానంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం. కాగా.. చాలా మంది నెటిజన్లు కూడా ఇదే సమాధానం చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. కేటీఆర్.. చాలా మంది ప్రజల కష్టాలను ముఖ్యంగా కోవిడ్ సమయంలో.. ట్విట్టర్ ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకొని.. వారి సమస్యలను పరిష్కరించిన సందర్భాలు  చాలానే ఉన్నాయి. చాలా మంది తమకు ఎదురైన కష్టాన్ని కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ గా చెప్పుకున్నారు.

click me!