చేనేతపై పన్ను వేసిన పాపపు ప్రభుత్వం మీదే: నేతన్నల సమస్యలపై బండి సంజయ్‌కి కేటీఆర్ లేఖ

Siva Kodati |  
Published : May 01, 2022, 09:26 PM IST
చేనేతపై పన్ను వేసిన పాపపు ప్రభుత్వం మీదే: నేతన్నల సమస్యలపై బండి సంజయ్‌కి కేటీఆర్ లేఖ

సారాంశం

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మండిపడ్డారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆదివారం నేతన్నల సమస్యలు, సంక్షేమంపై ఆయన బండి సంజయ్‌కి లేఖ రాశారు. చేనేతపై తొలిసారి పన్ను వేసిన పాపపు ప్రభుత్వం బీజేపీదేనని కేటీఆర్ ఫైరయ్యారు.   

తెలంగాణలో చేనేత రంగానికి ప్రభుత్వం భారీగా బడ్జెట్‌ కేటాయింపుల చేస్తోందని  తెలపారు ఆ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు (ktr)  . నేతన్నలకు యార్న్‌ సబ్సిడీ ఇస్తున్న  ప్రభుత్వం కూడా మాదేనని స్పష్టం చేశారు. నేతన్నల  సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజెపి (bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆయన నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్‌కి ఆదివారం బహిరంగలేఖ రాశారు. నేతన్నలకు బీమాను ఎత్తేసిన కేంద్రంపై బండి మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కేంద్రం బీమా (insurance) ఎత్తేస్తే... తాము ప్రత్యేక బీమా కల్పిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్నలపై బండికి నిజమైన ప్రేమ ఉంటే పార్లమెంట్‌లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేతల కోసం కేంద్ర సంస్థలు తెలంగాణలో ఏర్పాటుకు మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ కోరారు. చేనేతపై తొలిసారి పన్ను వేసిన పాపపు ప్రభుత్వం బీజేపీదేనని మంత్రి కేటీఆర్ బహిరంగలేఖలో దుయ్యబట్టారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్ కి కనిపించడం లేదా? అని మంత్రి ప్రశ్నించారు. ముంబై, భీవండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకి కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా కేటీఆర్ నిలదీశారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కి (kakatiya textile park) కేంద్రం నుంచి అందిన సాయంపై బండి సమాధానం ఇవ్వాలన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు