
ఉస్మానియా యూనివర్సిటీలో (osmania university) ఉద్రిక్తత కొనసాగుతోంది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టించారు ఎన్ఎస్‌యూఐ (nsui) విద్యార్ధులు. రాహుల్ సభకు (rahul gandhi) అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గేట్లు ఎక్కి భవనంలోకి దూసుకెళ్లారు విద్యార్ధులు. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలు ధ్వంసం చేశారు . ఈ ఘటనకు సంబంధించి 17 మంది విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ (venkat balmoor) , సహా కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు జారీ చేశారు పోలీసులు.
మరోవైపు బంజారాహిల్స్ పోలీసుల కస్టడీలో వున్న జగ్గారెడ్డిని (jaggareddy) పరామర్శించారు కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ (madhu yashki) , గీతారెడ్డి (geetha reddy) . అలాగే ఎన్‌ఎస్‌యూఐ విద్యార్ధి సంఘాల నేతలతోనూ మాట్లాడారు. అరెస్ట్ చేసిన విద్యార్ధులను కలిసేందుకు జగ్గారెడ్డి వారిని కలిసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
అటు అంబర్ పేట్ పీఎస్‌కు వెళ్లారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (v hanumantha rao) . అయితే స్టేషన్‌లోకి వీహెచ్‌ను అనుమతించలేదు పోలీసులు. ఓయూలో అరెస్ట్ అయిన విద్యార్ధులను పరామర్శించేందుకు వీహెచ్ వెళ్లారు. తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసేందుకు వీహెచ్ వెళ్లారు.
మరోవైపు జగ్గారెడ్డి, ఎన్ఎస్‌యూఐ నేత వెంకట్ బల్మూర్ అరెస్ట్‌లను ఖండించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) . పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామకమని.. పోలీసులు నేతల కోసం కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతివ్వకపోవటం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీ కుటుంబానికి.. ఇదేనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవమని విక్రమార్క ప్రశ్నించారు.