ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం.. నేటి ఎకనామిక్స్ పరీక్ష రద్దు.. అసలేం జరిగిందంటే..?

Published : May 02, 2023, 03:26 PM IST
ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం.. నేటి ఎకనామిక్స్ పరీక్ష రద్దు.. అసలేం జరిగిందంటే..?

సారాంశం

ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం నెలకొంది. ఈ రోజు ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్ష జరగాల్సి ఉండగా.. తెలుగు మీడియం ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపించారు. 

ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం నెలకొంది. ఈ రోజు ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్ష జరగాల్సి ఉండగా.. తెలుగు మీడియం ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపించారు. దీంతో అభ్యర్థులు ప్రశ్నపత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. పరీక్ష కేంద్రాల్లో చివరి నిమిషంలో ఇన్విజిలేటర్లు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ  ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్).. నేటి ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్షను రద్దు  చేస్తున్నట్టుగా ప్రకటించారు. రద్దైన పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నట్టుగా తెలిపింది. 

ఇక, కొన్ని కేంద్రాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులను రెండు గంటలకు పైగా హాల్లో కూర్చొబెట్టారు. చివరకు పరీక్ష రద్దైందని ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ఓపెన్ ఇంటర్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు పంపించే ముందు ప్రశ్నపత్రాలు సరైనవో? లేవో కూడా చెక్ చేసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. టాస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్