సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ అభిప్రాయమిదే.. ఏమన్నారంటే?

By Mahesh K  |  First Published Oct 21, 2023, 10:25 PM IST

సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కుర్చీ కావాలనే కోరికలేమీ లేవని స్పష్టం చేశారు. సీఎం అర్హతలున్నవారు పార్టీలో చాలా మంది ఉన్నారని వివరించారు. ప్రతిక్షాలకు తనపై ప్రేమ ఎక్కువ కాబట్టి తానే సీఎం కావాలని అవి కోరుకుంటున్నాయని చమత్కరించారు.
 


కొన్నాళ్లుగా తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అవుతారనే ప్రచారం విపరీతంగా జరిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు తనయుడు కేటీఆర్‌కు అప్పజెబుతారని జోరుగా చర్చలు జరిగాయి. అయితే.. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ యాస్పిరేషన్ కాస్త నెమ్మదించగా.. ఈ చర్చ కూడా చల్లబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ చర్చ తెరమీదికి వచ్చింది. 

సీఎం పదవి కేటీఆర్‌కే అని, బీఆర్ఎస్ గెలవగానే సీఎం కుర్చీని కేటీఆర్ అధిరోహిస్తారని చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై కేటీఆర్ స్వయంగా పలుమార్లు స్పష్టత ఇచ్చారు. తాజాగా మరోమారు ఈ అంశంపై మాట్లాడుతూ ఛమత్కారం కూడా విసిరారు.

Latest Videos

Also Read : మంత్రి పువ్వాడపై తుమ్మల ఫైర్.. ఖాసీం రజ్వీతో పోలిక

తమ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నవాళ్లు, సమర్థులు చాలా మంది ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం పదవిపై తనకేమీ కోరికలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ముమ్మాటికీ కేసీఆర్ అని చెప్పారు. ప్రతిపక్షాలకు తన మీద ప్రేమ ఎక్కువ కాబట్టే.. తాను సీఎం కావాలని కోరుకుంటున్నాయని చమత్కరించారు.

click me!