స్థానిక సంస్థలకు ఖమ్మం ఆదర్శం: మంత్రి కేటీఆర్

Published : Dec 07, 2020, 04:54 PM IST
స్థానిక సంస్థలకు ఖమ్మం ఆదర్శం: మంత్రి కేటీఆర్

సారాంశం

రాష్ట్రంలోని ఇతర కార్పోరేషన్లకు ఖమ్మం కార్పోరేషన్ ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.


ఖమ్మం: రాష్ట్రంలోని ఇతర కార్పోరేషన్లకు ఖమ్మం కార్పోరేషన్ ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఖమ్మంలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఐటీ హబ్ ను మంత్రి ప్రారంభించారు. 

also read:దుబ్బాక, జిహెచ్ఎంసి ఎఫెక్ట్... ఖమ్మంపై కేటీఆర్ వరాల జల్లు

ఖమ్మంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక శ్రద్దతో అభివృద్ధి పనులు పూర్తి చేయించుకొన్నారన్నారు.

అజయ్ కుమార్ లాంటి ప్రజా ప్రతినిధి ఉండడం ఖమ్మం ప్రజల అదృష్టమని కేటీఆర్ మంత్రిని అభినందించారు.రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు,కార్పోరేషన్లకు చెందిన ప్రజా ప్రతినిధులను కూడ ఖమ్మం పంపించి ఇక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రావాలని తాను సూచిస్తానని ఆయన చెప్పారు.

ఖమ్మంలో రోడ్ల కోసం రూ. 30 కోట్లు మంజూరు చేస్తామన్నారు. బుగ్గపాడులో త్వరలోనే పుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఐటీని రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేటలకు కూడా విస్తరించామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌