దుబ్బాక, జిహెచ్ఎంసి ఎఫెక్ట్... ఖమ్మంపై కేటీఆర్ వరాల జల్లు

By Arun Kumar PFirst Published Dec 7, 2020, 4:31 PM IST
Highlights

ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

ఖమ్మం: దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు రావడంతో టీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైన విషయం తెలిసిందే. అయితే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో రానున్న ఉపఎన్నికల్లో సత్తాచాటి ప్రజల్లో తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇందుకోసం ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ సర్కార్.

మొట్టమొదట ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఖమ్మం జిల్లానుండి ప్రారంభించారు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.  హోం మంత్రి మహమూద్ అలీ, ఆర్ ఆండ్ బి మంత్రి వేముల పప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్ రూ.218.06 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

కేటీఆర్ ప్రారంభించిన అభివృద్ధి పనులివే: 
  

1. రూ. 1.25 కోట్లతో నిర్మించిన ఖనాపురం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.

2. రూ. 2.85 కోట్ల రూపాయలతో బల్లెపల్లి అధునాతన వైకుంఠ ధామం ప్రారంభోత్సవం.

3. రూ. 18 కోట్ల రూపాయలతో పాండురంగాపురం-కోయచలక క్రాస్ రోడ్డు వరకు వెడల్పు, బిటి రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ లైటింగ్ ప్రారంభోత్సవం(కోయచలక సర్కిల్ వద్ద). 

4. రూ.5 కోట్ల రూపాయలతో కోయచెలక రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు.

5. రూ. 8.4 కోట్ల రూపాయలతో రఘునాధపాలెం- చింతగుర్తి వరకు చేపట్టిన బిటి రోడ్డు వెడల్పు ప్రారంభోత్సవం.

6. రూ. 25లక్షలతో నిర్మించిన రఘునాధపాలెం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.

7. రూ. 4.50 కోట్లతో నిర్మించిన ఎన్ఎస్‌పి కెనాల్ వాల్క్ వేను ప్రారంభోత్సవం చేశారు.

8. రూ.70 లక్షలతో నిర్మించిన  కెఎంసి పార్క్(పట్టణ ప్రకృతి వనం, 22వ డివిజన్) ప్రారంభోత్సవం చేశారు. 

9. రూ.11 లక్షలతో లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పివి. నర్సింహారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు.

10. రూ.77 కోట్ల రూపాయలతో నిర్మించిన దంసలాపురం ఆర్వోబి, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేశారు. అక్కడే సర్కిల్లో ప్రో. జయశంకర్ సార్ విగ్రహంను ఆవిష్కరించారు.

11. రూ.3 కోట్ల రూపాయలతో నిర్మించిన పోలీస్ కమీషనరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. 

12. రూ.70 కోట్లతో సుందరయ్య నగర్ నందు గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ(ఓపెన్ జిమ్, పార్క్) ప్రారంభోత్సవం చేశారు.

13. రూ.27 కోట్లతో ఇల్లందు సర్కిల్లో ఐటీ హబ్ ను  ప్రారంభోత్సవం చేశారు.

click me!