పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలి: బీఆర్ఎస్ నేతలకు తేల్చి చెప్పిన కేటీఆర్

By narsimha lode  |  First Published Aug 19, 2023, 4:28 PM IST

పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని  మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు.


హైదరాబాద్:  పార్టీ ఎవరికి టిక్కెట్టు ఇస్తే వారి విజయం కోసం  నేతలంతా  సమిష్టిగా  కృషి చేయాలని  తెలంగాణ మంత్రి కేటీఆర్  బీఆర్ఎస్ నేతలను కోరారు.కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని  తలకొండపల్లి జడ్ పీ టీసీ  వెంకటేష్  బీఆర్ఎస్ లో చేరారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  ఆయన  ప్రసంగించారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ  చేసేందుకు  నలుగురైదుగురికి ఆసక్తి ఉండొచ్చు...ఇందులో తప్పేమీ లేదన్నారు. 

also read:ఢిల్లీ గులామ్‌లకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరు: కేటీఆర్

Latest Videos

undefined

కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో  ఒక్కరే ఎమ్మెల్యే అవుతారన్నారు. గతంలో  ఇద్దరు  ఎమ్మెల్యేలు ఉండేవారని ఆయన సెటైర్లు వేశారు.   కల్వకుర్తిలో  నలుగురికి నాలుగు ఆలోచనలు ఉండొచ్చన్నారు. కానీ ఉన్నది ఒక్కటే బీ ఫాం, ఒక్కటే  ఎమ్మెల్యే సీటు అని ఆయన  చెప్పారు. 
 అన్ని అంశాలను  పరిశీలించి అభ్యర్ధులను ప్రకటించిన  తర్వాత  తమ వ్యక్తిగత అభిప్రాయాలను  పక్కన పెట్టి  పార్టీ ప్రకటించిన అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్  కోరారు.కేసీఆర్ ను మూడోసారి సీఎంను చేసేందుకు పార్టీ ఎవరిని నిర్ణయిస్తే  ఆ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని  14 అసెంబ్లీ స్థానాలను ఈ దఫా దక్కించుకోవాలని కేటీఆర్  కోరారు. గత ఎన్నికల్లో  కొల్లాపూర్ లో  ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో  బీఆర్ఎస్ టిక్కెట్టు కోసం  పలువురు నేతలు పోటీ పడుతున్నారు.  గత నెలలో  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లాలోని ఫామ్ హౌస్ లో  భేటీ అయ్యారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే  జైపాల్ యాదవ్ కు ఈ దఫా టిక్కెట్టు ఇవ్వవద్దని ఆయన వ్యతిరేక వర్గీయులు కోరుతున్నారు.  ఇదే నియోజకవర్గానికి  చెందిన చిత్తరంజన్ దాస్ కూడ  టిక్కెట్టును ఆశిస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. వ్యక్తిగత కోరికలను  పక్కన పెట్టి  పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని  ఆయన కోరడంపై ఆశావాహుల్లో అంతర్మథనం మొదలైంది. ఎవరికి టిక్కెట్టు వచ్చినా మిగిలిన ఆశావాహులు  వారి విజయం కోసం  పనిచేయాలని కేటీఆర్ తేల్చి చెప్పారు.అభ్యర్థుల ఎంపిక కోసం  స్థానికంగా ఉన్న పరిస్థితులు, సర్వే ఫలితాల ఆధారంగా  కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్నారు.

click me!