నారాయణమూర్తి రైతన్న సినిమా చూసిన మంత్రి జగదీష్ రెడ్డి... ఆయన రివ్యూ ఇదీ

By Arun Kumar PFirst Published Aug 20, 2021, 1:42 PM IST
Highlights

ఆర్. నారాయణమూర్తి దర్శకత్వం వహించి నిర్మించడమే కాదు నటించిన రైతన్న సినిమాను మంత్రి జగదీష్ రెడ్డి థియేటర్లో వీక్షించారు. 

సూర్యాపేట: ఆర్. నారాయణమూర్తి దర్శకుడిగానే కాకుండా నటించి నిర్మించిన రైతన్న సినిమాను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి థియేటర్ లో వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ... రైతుల సమస్యలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించిందన్నారు. ముఖ్యంగా రైతు చట్టాలతో పాటు విద్యుత్‌ చట్టంలో సవరణల వల్ల రైతులకు జరిగే నష్టాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారని అన్నారు.

రైతన్న సినిమాను థియేటర్ కు వెళ్లి చూసిన మంత్రి జగదీష్ రెడ్డితో ఇవాళ సూర్యాపేటలో కలుసుకున్నారు ఆర్. నారాయణమూర్తి. ఈ సందర్భంగా  సినిమాలోని అంశాలపై కాస్సేపు వీరిద్దరు చర్చించుకున్నారు. తన సినిమాను ఆదరించినందుకు మంత్రికి నారాయణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. 

read more  నారాయణ మూర్తి రైతన్న సినిమా తప్పకుండా చూడండి: మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను ఉరుములు లేని పిడుగు వంటివని అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.  

ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతన్న సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అన్నదాత కష్టాలను కళ్లకుకట్టినట్లు చూపించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని... రైతులు, ప్రజలు, మీడియాతో పాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలని  సూచించారు. ప్రజల హితాన్ని కోరే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని... అలాంటిదే ఈ రైతన్న సినిమా అన్నారు. వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితులలో ప్రజల కోసం, రైతుల హితాన్ని కాంక్షిస్తూ వస్తున్న ప్రభోధాత్మక సినిమా రైతన్న అని మంత్రి కొనియాడారు. 

సమాజ హితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారన్నారు. ఇలా సినిమా మాద్యమం ద్వారా ఆర్ నారాయణ మూర్తి కృషి చేస్తుంటారన్నారని అన్నారు. ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడైన నారాయణమూర్తి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రైతన్న సినిమాను నిర్మించారని వ్యవసాయ మంత్రి తెలిపారు.

click me!