ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు: భార్యపై పోలీసుల అనుమానం

By telugu teamFirst Published Aug 20, 2021, 1:33 PM IST
Highlights

రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసు కీలకమైన మలుపు తిరిగింది. కారులో పూర్తిగా కాలిపోయిన స్థితిలో అతని మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. అతని హత్యలో భార్య పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మెదక్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసు కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసులో శ్రీనివాస్ భార్యను పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యకు ముందు రోజు శివ అనే వ్యక్తి శ్రీనివాస్ తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్యకు శివ సోదరుడు. దీంతో శ్రీనివాస్ భార్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో ధర్మకారి శ్రీనివాస్ శవాన్ని కారులో పోలీసులు గుర్తించారు. కారులో శవం దగ్ధమైన స్థితిలో కనిపించింది.  మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో మృతుడి నోటిలోని కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్ ను ఆయన భార్య హైందవి గుర్తించారు. ఆ తర్వాత తన భర్త మరణంపై ఆమె వెల్దుర్తి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని, దాంతో తనతో తరుచుగా గొడవ పడుతుండేవాడని హైందవి అప్పట్లో చెప్పారు. ధర్మకారి శ్రీనివాస్ కు మెదక్ పట్టణంలో ఓ సినిమా థియేటర్ కూడా ఉంది. 

కారు దగ్ధం కావడంతో తొలుత దాన్ని ప్రమాదంగా భావించారు. కారులో ధర్మకారి శ్రీనివాస్ మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది. అయితే, అతన్ని పోలీసులు హత్య చేసినట్లుగా గుర్తించారు. 

click me!