కేసీఆర్ సర్కార్ కొత్త పథకాలు: రాష్ట్ర ఖజనాపై మరింత భారం, ఆర్ధిక శాఖకు సవాల్

Published : Jan 19, 2022, 02:29 PM IST
కేసీఆర్ సర్కార్ కొత్త  పథకాలు: రాష్ట్ర ఖజనాపై మరింత భారం, ఆర్ధిక శాఖకు సవాల్

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తుంది.ఈ సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మరింత భారం పడే అవకాశం ఉంది.    

న్యూఢిల్లీ: Telangana రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించాలని భావిస్తుంది. అయితే ఈ నిర్ణయం ఆర్ధిక శాఖకు సవాలేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

రెండు రోజుల క్రితం నిర్వహించిన Cabinet సమావేశంలో  Kcr సర్కార్ కొత్త సంక్షేమ పథకాల విషయమై నిర్ణయం తీసుకొంది. మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకొంది.  ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయాలనుకొంటున్న కొత్త పథకాలు రాష్ట్ర ఖజానాపై మరింత భారాన్ని మోపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

రాస్ట్ర ప్రభుత్వం Dalitha bandhu  పథకానికి అత్యధికంగా నిధులు ఖర్చు చేయాలని భావిస్తుంది. సుమారు రూ. 20 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనున్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమానికి సుమారు రూ. 3 వేల కో్లు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు తమ స్వంత ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్ధిక సహాయం కోసం సుమారు రూ. 5 వేల కోట్లు అవసరమౌతాయని అంచనా. ఆసరా పెన్షన్ల లబ్దిదారుల వయస్సును 65 నుండి 57కి పెంచడంతో మరో రూ. 3 వేల కోట్లు అవసరం కానున్నాయి. నిరుద్యోగ భృతికి రూ. 3,500 కోట్లు  కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న Welfare Schemes  అమలు చేయడంలో  రాష్ట్ర ప్రభుత్వానికి  అప్పుడప్పుడు కొంత ఇబ్బందిగా ఉందనే చర్చ కూడా లేకపోలేదు. అయితే కొత్త పధకాలకు నిధులను సమీకరించడం అధికారులకు సవాల్ గా మారింది.

Corona సమయంలో రాష్ట్ర ఆర్ధిక  పరిస్థితి ఇబ్బందిగా మారింది. అయితే ఆ తర్వాత రాష్ట్రం త్వరగానే కోలుకుంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రెవిన్యూలో అత్యధిక భాగం Hyderabad నుండే వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం Rythu Bandhu పథకాన్ని 2018 మే మాసంలో ప్రారంభించింది. అయితే ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి ఎలాంటి అంతరాయం లేకుండా ఈ పథకాన్ని కొనసాగించడమే  రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.

Rabi సీజన్ లో రైతు బంధు పథకానికి నిధుల కొరత ఏర్పడుతుంది. అయితే గత డిసెంబర్ 28 నుండి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేయడం ప్రారంభించింది.ఈ నెల 17వ తేదీ వరకు రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేసింది.

18 ఎకరాలకు పైగా భూములున్న వేలాది మంది రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రైతులకు చెల్లించని రైతులను కవర్ చేయడానికి మరో రూ.1500 కోట్ల అవసరం. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ. 1 లక్ష పంట రుణ మాఫీ పథకం కూడా నిధుల కొరత కారణంగా పెండింగ్ లో ఉంది. రెండేళ్లలో రూ. 50 వేల వరకు రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం రుణమాఫీకి రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు రెండు దశల్లో రూ. 75 వేలు, రూ. 1 లక్ష రుణాలను మాఫీ  చేయడానికి సుమారు రూ. 10 వేల కోట్లు అవసరమౌతాయి.

కొత్త ఆర్ధిక సంవత్సరంలో కొత్త పథకాలకు నిధులు సమకూర్చేందుకు అదనంగా రూ. 35 వేల కోట్లు సమీకరించాలి.  2022-23 రాష్ట్ర బడ్జెట్ లో బడ్జెట్ కేటాయింపులు చేయడం ఆర్ధికశాఖకు తలకు మించిన భారంగా మారనుంది. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ ను తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టనుంది.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్