munugode bypoll 2022: వామపక్షాలు మద్దతిస్తే తీసుకొంటామన్న మంత్రి జగదీష్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 14, 2022, 3:54 PM IST
Highlights

ఈడీలకు తాము భయపడబోమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి  జగదీష్ రెడ్డి ప్రకటించారు.  బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అంటూ ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇవే చివరి ఎన్నికలు అంటూ ఆయన జోస్యం చెప్పారు. 

నల్గొండ: ఈడీలు,బోడీలకు భయపడేది లేదని  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.ఆదివారం నాడు ఆయన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడారు.   ఈడీని కేంద్రం వాడుకోదల్చుకొంటే తెలంగాణలో ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరి  బండి సంజయ్  చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను లొంగదీసుకోవడం ఎవరి తరం కాదన్నారు.  ఈడీ తన జేబు సంస్థ అని బండి సంజయ్ ఒప్పుకొన్నట్టేనన్నారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఫైరయ్యారు.

మునుగోడులో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలుస్తామని వామపక్షాలు చెబుతున్న విషయాన్ని మంత్రి గర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు తమకు మద్దతు ప్రకటిస్తే తీసుకొనే తాము సిద్దంగా ఉన్నామని మంత్రి చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇవే చివరి ఎన్నికలు అని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు.

also read:Munugode Bypoll 2022 బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీకే మద్దతు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

 ఈడీని కేంద్రం వాడుకోదల్చుకొంటే తెలంగాణలో ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరి  బండి సంజయ్  చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని  ఈ నెల 20వ తేదీన  చౌటుప్పల్ మండలంలో టీఆర్ఎస్ సభను నిర్వహిస్తుంది.ఈ సభను విజయవంతం చేయడం కోసం మంత్రి జగదీష్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో  పర్యటిస్తున్నారు.మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీని  ఎవరు ఓడిస్తారో ఆ పార్టీకి మద్దతిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  చెప్పారు.  టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలలో  ఏ పార్టీ  బీజేపీని ఓడిస్తోందో  ఆ పార్టీకి  మద్దతిస్తామని తమ్మినేని వీరభద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.  ఈ స్థానంలో తన పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.బీజేపీ నుండి ఈ దఫా ఈ స్థానం నుండి పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బుద్ది చెప్పాలని  కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ స్థానంలో  విజయం సాధించాలని టీఆర్ఎస్ కూడ అదే పట్టుదలతో ప్రయత్నలను మొదలు పెట్టింది.
 

click me!