కాంగ్రెస్‌..బీజేపీల‌తోనే స్థానిక‌ సంస్థల నిర్వీర్యం: మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

By team telugu  |  First Published Dec 3, 2021, 4:12 PM IST

తెలంగాణాలో వ్య‌వ‌సాయ‌, విద్యుత్ రంగాలలో సంక్షోభం సృష్టించే విధంగా బీజేపీ కొత్త కుట్ర‌కు తెర‌లేపుతున్న‌ద‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. దీనికి కోసం రాష్ట్ర కాంగ్రెస్‌, బీజేపీ క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని ఆరోపించారు.  
 


స్థానిక సంస్థలను నిర్వీర్యం  చేసింది కాంగ్రెస్,బీజేపీలేన‌ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారం చేలాయించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలకులు స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన దుయ్యబట్టారు. స్థానిక సంస్థలకు శాసనమండలి కోటాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం భోనగిరి, ఆలేరు,నకిరేకల్ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, తెలంగాణా లో వ్యవసాయం,విద్యుత్ రంగాలలో సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని అందుకు ఇక్కడి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని మంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే ప్రక్రియ లో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లు చెట్టాపట్టాలేసుకుని పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

Also Read: ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్

Latest Videos

undefined

మోడీ సర్కార్ కొత్తగా తెచ్చిన విద్యుత్ ,వ్యవసాయ చట్టాలే  అందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖ్యాతి హస్తినకు పాకిందని అది తట్టుకోలేకనే ఆ రెండు పార్టీలు ఈ కుట్రలకు తెరలేపుతున్నాయన్నారు. అందుకు కారణం విద్యుత్, వ్యవసాయ రంగాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలే కారణమన్నారు. అలాగే,  ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మకమైన సంక్షేమ పథకాల పై  దేశ‌వ్యాప్తంగా చర్చ మొదలైందని అన్నారు. ఆ భయంతోనే  తెలంగాణ లో సీఎం కేసీఆర్ కు బాసటగా నిలిచిన రైతాంగంలో అలజడి సృష్టించే కుట్రలకు బీజేపీ తెర లేపిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తి లేదని ఒకవైపు కేంద్రం చెబుతుంటే బాధ్యత లేని ఇక్కడి బీజేపీ నాయకత్వం అందుకు భిన్నంగా వ్యహారించడం రైతాంగంలో అయోమయం సృష్టించెందుకే నని ఆయన విమర్శించారు.

Also Read: హీట్ పుట్టిస్తున్న పంజాబ్ రాజ‌కీయం.. పొత్తుల్లో అమరీందర్ దూకుడు

తెలంగాణ సమాజం ఎప్పుడూ తనదైన చైతన్యాన్ని చాటుకుంటుందని ఆయన తెలిపారు. బాధ్యత లేని బండి సంజయ్ లాంటి నేతలు కల్లాల వద్దకు వస్తుంటే ఇక్కడి సమాజం అటువంటి చైతన్యాన్ని చాటిందని ఆయన అభినందించారు. రేపటి శాసనమండలి ఎన్నికల్లోనూ అదే చైతన్యాన్ని చాటేందుకు ఓటర్లు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలకోటాలో శాసన మండలి కి జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన జిల్లాగా నల్లగొండ జిల్లా రికార్డ్ నమోదు చేసుకోబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఈ స‌మావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,శాసనమండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, జడ్ పి చైర్మన్ లు ఎలిమినేటి సందీప్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు  పాల్గోన్నారు. 

Also Read: రైతు ఉద్యమం ఆగదు.. పెండింగ్ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..

click me!