అగ్రిమెంట్ ముగిసినా ఖాళీ చేయడం లేదని.. ఏకంగా ఐసీడీఎస్ ఆఫీసుకు తాళం వేసిన భవన యజమాని

By Siva KodatiFirst Published Dec 3, 2021, 3:47 PM IST
Highlights

మెట్‌పల్లి పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి (icds office) తాళం వేశాడు ఇంటి యజమాని. అద్దె ఇంటి అగ్రిమెంట్ ముగిసినా, ఖాళీ చేయక పోవడంతో మెట్‌పల్లి (metpally) ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి తాళం వేశాడు. అధికారులు ఎన్నిసార్లు ఖాళీ చేయమని చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఇలా చేసినట్లు భవన యజమాని తెలియజేశారు. 

అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు సంబంధించి తెలంగాణలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమకు చెల్లించాల్సిన పెండింగ్ అద్దె ఇవ్వకపోవడంతో పలువురు భవన యజమానులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేస్తున్నారు. తాజాగా మెట్‌పల్లి పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి (icds office) తాళం వేశాడు ఇంటి యజమాని. అద్దె ఇంటి అగ్రిమెంట్ ముగిసినా, ఖాళీ చేయక పోవడంతో మెట్‌పల్లి (metpally) ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి తాళం వేశాడు. అధికారులు ఎన్నిసార్లు ఖాళీ చేయమని చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఇలా చేసినట్లు భవన యజమాని తెలియజేశారు. 

కొద్దిరోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో కూడా ఇదే  తరహా ఘటన జరిగింది. జిల్లాలో (karimnagar district) నూతన మండలాల ఆవిర్భావంలో భాగంగా గన్నేరువరం (ganneruvaram) మండలాన్ని అధికారులు నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ప్రైవేట్ భవనాల్లో ఆఫీసులు నెలకొల్పారు. ఇందులో భాగంగా గన్నేరువరం ఎంపీడీవో కార్యాలయం కోసం 2019 జులైలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ. 12,500 చొప్పున కిరాయి ఇచ్చేందుకు అధికారులు .. ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నారు. 

ALso Read:18 నెలల అద్దె బకాయి.. ఏకంగా ఎంపీడీవో ఆఫీసుకు తాళం వేసిన ఇంటి యజమాని

అప్పటినుండి ఇప్పటివరకు 29 నెలలు గడవగా 11 నెలల కిరాయి మాత్రమే ఇచ్చారని మిగతా కిరాయి ఇవ్వడం లేదని ఇంటియజమాని తిరుపతి వాపోయారు. అద్దె చెల్లించాలని అడుగుతుంటే అధికారులు రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అద్దె రూపంలో రూ. 2.25 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు లోను తీసుకుని భవనాన్ని కట్టించానని, నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన అద్దె బకాయి మొత్తం చెల్లించే వరకూ ఎంపీడీవో కార్యాలయ తాళం తీసేది లేదని ఆయన తేల్చిచెప్పాడు.

click me!