ఎవరో ఆర్డర్ ఇస్తే.. మేమెందుకు వినాలి, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆగదు: ఏపీ సర్కార్‌కు జగదీశ్ రెడ్డి కౌంటర్

By Siva KodatiFirst Published Jun 30, 2021, 8:29 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ని నిర్మించిందే జల విద్యుత్ కోసమని ఆయన గుర్తుచేశారు. కరెంట్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఏపీ సర్కార్‌కు లేదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి తమ హక్కని ఖచ్చితంగా చేసి తీరతామన్నారు జగదీశ్ రెడ్డి.

ఏపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ని నిర్మించిందే జల విద్యుత్ కోసమని ఆయన గుర్తుచేశారు. కరెంట్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఏపీ సర్కార్‌కు లేదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి తమ హక్కని ఖచ్చితంగా చేసి తీరతామన్నారు జగదీశ్ రెడ్డి. కృష్ణానదీలో తెలంగాణ వాటా కింద వున్న ప్రతి నీటి చుక్కను ఎలా వినియోగించుకోవాలో తమకు బాగా తెలుసునని మంత్రి స్పష్టం చేశారు.

Also Read:మీకంటే ఎక్కువే మాట్లాడగలం.. చేతకాకకాదు : తెలంగాణ మంత్రులకు అనిల్ కుమార్ కౌంటర్

విద్యుత్ ఉత్పత్తిని ఆపేదిలేదని, ఎవరో ఆర్డర్ ఇస్తే వినాల్సిన అవసరం లేదని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ చెప్పారని.. కానీ ఏపీ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని జగదీశ్ రెడ్డి తెలిపారు. గతంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి దొడ్డిదారిన కృష్ణా జలాలను ఏపీకి తరలించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. 

కాగా, రైతుల అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ మంత్రులు పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలంగాణ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖలు రాస్తామని వారు వెల్లడించారు. మరో వైపు .. ఎన్జీటీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్దని చెప్పినా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేఆర్ఎంబీ కమిటీ బృందం జూలై 3న రెండు ప్రాజెక్ట్‌లను సందర్శించనుంది. 

click me!