సంతోష్ కు టిఆర్ఎస్ రాజ్యసభ సీటు ఎందుకంటే ?

First Published Mar 26, 2018, 5:40 PM IST
Highlights
ఇటీవల మూడు రాజ్యసభ స్థానాల్లో సిఎం కేసిఆర్ టిఆర్ఎస్ తరుపున అభ్యర్థులను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారనే విషయాన్ని తేటతెల్లం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఇటీవల మూడు రాజ్యసభ స్థానాల్లో సిఎం కేసిఆర్ టిఆర్ఎస్ తరుపున అభ్యర్థులను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారనే విషయాన్ని తేటతెల్లం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన బడుగుల లింగయ్య యాదవ్ కు సోమవారం సూర్యాపేట జిల్లాలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. అనంతరరం జరిగిన అభినందన సభలో రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారో కింద చదవండి.

పక్క రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలలో వందల కోట్లు చేతులు మారాయి. రాజ్యసభ ఎన్నికలు అంటేనే కోట్లతో కూడుకున్న పనంటూ పత్రికలలో చూశాం. శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆర్ధికంగా భయపడే వారినే ముఖ్యమంత్రి కెసియార్ ఎంపిక చేశారు. ఇంటి పేరులోనే బడుగుల ఉన్న బడుగు బలహీన వర్గాలకు టి ఆర్ యస్ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుంది అనడానికి బడుగుల లింగయ్య యాదవ్ ఎంపిక నిలువెత్తు నిదర్శనం. మరో అభ్యర్థి బండా ప్రకాష్ కూడ బడుగు బలహీన వర్గానికి అదీ ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి. కెసియార్ గారికి నీడలా ఉండే జోగీనేపల్లి సంతోష్ కుమార్ మూడో అభ్యర్థి.

రాజ్యసభకు ఈ తరహ అభ్యర్దులను ఎంపిక చేసి రాజకీయాలలో పారదర్శకతను నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి కెసియార్ నీడ కూడ వదిలి పెడుతూందేమో కానీ,ముఖ్యమంత్రిని వదలని మూడో అభ్యర్ధే సంతోష్ కుమార్. ముఖ్యమంత్రి కెసియార్ నీడలా వెన్నంటి ఉండడమే కాదు, అనుక్షణం, నిరంతరం కంటికి రెప్పలా కెసియార్ ను కాపాడుకుంటున్న అభ్యర్థి గా సంతోష్ ను రాజ్యసభకు ఎంపిక చెయ్యడం అభినందనీయం. పార్టీ ఆవిర్భావం నుండి ముఖ్యమంత్రి కెసియార్ తో పాటు టి ఆర్ యస్ పార్టీ వ్యహారాలలో కీలక పాత్ర పోషించిన సంతోష్ కుమార్, బడుగు బలహీన వర్గాలకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాష్ ముదిరాజ్ లను రాజ్యసభ కు ముఖ్యమంత్రి కెసియార్ ఎంపిక చెయ్యడం అంటే రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వెయ్యడమే.

టి ఆర్ యస్ పార్టీ ఆవిర్భావంలోనే ఏర్పాటు చేసుకున్న రాజ్యంగంలో 51% బడుగు,బలహీన, హరిజన, గిరిజన మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ లను రూపొందించుకున్న ఏకైక పార్టీ టి ఆర్ యస్ మాత్రమే. పార్టీలో రిజర్వేషన్ లు ఉండాలంటూ పార్టీ రాజ్యంగంలో పొందు పరుచుకున్న పార్టీ కూడా యావత్ బారత దేశంలో ఒక్క టి ఆర్ యస్ పార్టీనే.

పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలలో పోటీ చేసే బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అభ్యర్ధూలకు డిపాజిట్ జమ చెయ్యడం ముఖ్యమంత్రి కెసియార్ సాంప్రదాయంగా పెట్టుకున్నాడు. ఏ ఎన్నికలు వచ్చినా ముందుగా ముఖ్యమంత్రి కెసియార్ ఆలోచించేది బడుగు, బలహీన వర్గాల గురించే. అటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ముఖ్యమంత్రి కెసియార్ నాయకత్వంలో పనిచేసేందుకు  బడుగుబలహీనవర్గాలతో పాటు హరిజన, గిరిజన, మైనారిటీ ప్రజలు ముందుకు రావాలి.

 

click me!