చలువ పందిళ్లలో టిఆర్ఎస్ వేడి రాజకీయం

First Published Mar 26, 2018, 1:47 PM IST
Highlights
తెలంగాణ సర్కారు కొత్త వివాదాన్ని రగిలించింది. చలువ పందిళ్ల పేరుతో రాజకీయ వేడి రగిలించింది. భద్రాచలంలో రామయ్య వేడుకలకు రాజకీయ రంగు పులిమింది.

తెలంగాణ సర్కారు కొత్త వివాదాన్ని రగిలించింది. చలువ పందిళ్ల పేరుతో రాజకీయ వేడి రగిలించింది. భద్రాచలంలో రామయ్య వేడుకలకు రాజకీయ రంగు పులిమింది.

ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న భద్రాచలం రామయ్య కళ్యాణ మండపాల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేయడం ఏటా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది తెలంగాణ సర్కారు గులాబీ రంగుతో కూడిన చలువు పందిళ్లను ఏర్పాటు చేసింది. అయితే ఏ రంగులో వేయాలన్న నిబంధనలు ఏమీ లేకపోయినా.. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అన్ని పార్టీల ప్రతినిధులు, అన్ని పార్టీల ప్రజలు అక్కడికి వస్తారు. ఈ పరిస్థితుల్లో అదేదో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి వేసినట్లు గులాబీ రంగు పందిళ్లు గుబాలించేలా అధికారులు ఏర్పాట్లు చేయడం పట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

కానీ ప్రతి ఏటా చలువ పందిళ్లను తెలుపు రంగులోనే ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు తెలుపు రంగులో ఉండే వస్త్రాలను ఉపయోగించి పందిళ్లను రూపొందించేవారు. కానీ ఈసారి కొత్తగా ఉంటుందనుకున్నారో లేక పాలక పెద్దల మెప్పు పొందాలనుకున్నారో కానీ.. మొత్తానికి ఆలయ అధికారులు మాత్రం ఇలా పింక్ పందిళ్లను ఏర్పాటు చేసి కొత్త చర్చను లేవనెత్తారు.

click me!