గురుపౌర్ణమి రోజున గురువుని పూజించిన మంత్రి జగదీష్ రెడ్డి

Published : Jul 16, 2019, 02:59 PM IST
గురుపౌర్ణమి రోజున గురువుని పూజించిన మంత్రి జగదీష్ రెడ్డి

సారాంశం

గురుపౌర్ణమిని పురస్కరించుకొని తన గురువుని తెలంగాణ విద్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి పూజించారు. 

గురుపౌర్ణమిని పురస్కరించుకొని తన గురువుని తెలంగాణ విద్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి పూజించారు. గురుపౌర్ణమి రోజున తమకు విద్య నేర్పిన గురువులను పూజించడం ఆనవాయితి. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి గురువారం తన చిన్ననాటి గురువు సుబ్బయ్య మాస్టర్ ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు.

ముందుగా పాదాభివందనం చేసి.. శాలువాతో సత్కరించారు. ఆయనకు నమస్కరించి గురు దక్షిణగా రూ.పదివేలు తన గురువుకి అందజేశారు. గురుపౌర్ణమికి గురువుని పూజించి వస్త్రం, పుష్పాలు, ధాన్యం లాంటివి సమర్పించడం ఆనవాయితి. అందుకే మంత్రి ధనాన్ని గురు దక్షిణగా సమర్పించారు. కాగా... మంత్రి ఇలా వచ్చి తనకు గురుపూజ చేయడం పట్ల సుబ్బయ్య మాష్టర్ హర్షం వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!