వీకెండ్ కీచకుడు: చిన్నారులపై అత్యాచారం, తెలివిగా ఎస్కేప్

By Siva KodatiFirst Published Jul 16, 2019, 2:08 PM IST
Highlights

సెక్యూరిటీ గార్డుగా నలుగురికి రక్షణ కల్పించే బాధ్యత గల ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి  శని, ఆదివారాల్లో కీచకుడిగా మారిపోయి చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నాడు.

సెక్యూరిటీ గార్డుగా నలుగురికి రక్షణ కల్పించే బాధ్యత గల ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి  శని, ఆదివారాల్లో కీచకుడిగా మారిపోయి చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నాడు. అక్కడ ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడుతూ పోలీసులను సైతం బోల్తాకొట్టించేవాడు.

వివరాల్లోకి వెళితే..  రాజస్థాన్‌కు చెందిన సుశీల్ కుమార్ సింగ్‌ హైదరాబాద్ కాటేదాన్ ఇంస్ట్రీయల్ ఏరియాలో గన జైన్ ఫుడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. శని, ఆదివారాల్లో సెలవు కావడంతో స్థానికంగా ఉన్న బస్తీల్లోకి వెళ్లి.. ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులకు చాక్లెట్లు ఆశ చూపేవాడు.

అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి కంపెనీకి వెళ్లిపోతుండేవాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఓ చిన్నారిపై అత్యాచారం చేశాడు.

పరువుపోతుందని భావించిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఎట్టకేలకు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం వారాంతాల్లోనే, అది కూడా చిన్నారులపైనే అత్యాచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో ఘటన జరిగిన ప్రాంతాల్లో కెమెరాలో నమోదైన నిందితుడి ఫోటో లభించింది.

దీంతో అతని ఫోటోను తీసుకున్న  150 మంది పోలీసులు ఇంటింటికి తిరిగి సుశీల్‌కుమార్‌ను పట్టుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 

click me!