కలెక్టర్ సీరియస్:నారాయణఖేడ్‌లో సినీ హీరో మంచు మనోజ్‌కు ఓటు (వీడియో)

Published : Jul 16, 2019, 02:21 PM ISTUpdated : Jul 16, 2019, 03:20 PM IST
కలెక్టర్ సీరియస్:నారాయణఖేడ్‌లో సినీ హీరో మంచు మనోజ్‌కు ఓటు (వీడియో)

సారాంశం

 ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాటిలీ పరిధిలో సినీ నటుడు మంచు మనోజ్ పేరుతో ఓటు హక్కునమోదైంది.  

నారాయణఖేడ్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాటిలీ పరిధిలో సినీ నటుడు మంచు మనోజ్ పేరుతో ఓటు హక్కునమోదైంది.  హైద్రాబాద్ ‌లో నివాసం ఉండే సినీ నటుడు మంచు మనోజ్ పేరుతో నారాయణఖేడ్‌లో ఓటు హక్కు నమోదు కావడంపై బీజేపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై   కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని రెండో వార్డులో  సినీ నటుడు మంచు మనోజ్‌కు ఓటు హక్కు లభించింది. రెండో వార్డులోని  2-25  ఇంటి నెంబర్‌లో  మంచు మనోజ్ కు ఓటు హక్కును కల్పించారు అధికారులు.  ఓటరు లిస్టులో 428 నెంబర్‌తో ఈ ఓటు హక్కును కల్పించారు. 

మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుగా కూడ ఈ లిస్టులో ఉంది.  మంచు మనోజ్ ఫోటోనే ఓటరు జాబితాలో ఉంది.ఓటరు బాబితాను పరిశీలించిన స్థానిక బీజేపీ నేతలు అధికారులను ఈ ఓటు విషయమై నిలదీశారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఓటరు నమోదు కోసం వచ్చిన ధరఖాస్తులను సక్రమంగా పరిశీలించకుండానే ఓటు హక్కు కల్పిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని  వారు కోరుతున్నారు.

 

"

 

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే