ఎయిమ్స్ కోసం బిల్డింగ్, ల్యాండ్ ఇచ్చాం .. ఎందుకీ అబద్ధాలు, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: హరీశ్ రావు

By Siva KodatiFirst Published Nov 11, 2021, 5:45 PM IST
Highlights

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై (kishan reddy) మండిపడ్డారు టీఆర్ఎస్ నేత (trs), మంత్రి హరీశ్ రావు (harish rao) . ఎయిమ్స్‌కి (aiims) స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అన్నారని, కానీ తాము స్థలం ఇచ్చామని తేల్చిచెప్పారు. ఇందుకు గాను కిషన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై (kishan reddy) మండిపడ్డారు టీఆర్ఎస్ నేత (trs), మంత్రి హరీశ్ రావు (harish rao) . గురువారం టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్‌కి (aiims) స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అన్నారని, కానీ తాము స్థలం ఇచ్చామని తేల్చిచెప్పారు. ఇందుకు గాను కిషన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్‌పై తాము వ్యాట్ వేయలేదని మంత్రి స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి తప్పుడు సమాచారంతో మాట్లాడితే అభాసుపాలవుతారని ఆయన ఎద్దేవా చేశారు. పచ్చి అబద్ధాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని... మెడికల్ కాలేజీల కోసం సంప్రదించలేదని కిషన్ రెడ్డి చెప్పారంటూ హరీశ్ రావు దుయ్యబట్టారు. 

రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయం చేస్తామంటే ఎలా అని ఆయన ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు లభించిన హక్కు అని హరీశ్ రావు స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ వుంటే విభజన హామీలను తక్షణం అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు స్థలంతో పాటు బిల్డింగ్ కూడా ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు. 

Also Read:హరీశ్‌రావుకు అదనపు బాధ్యతలు.. వైద్యారోగ్య శాఖ కూడా ఆయనకే, హుజురాబాద్‌ ఎఫెక్ట్ లేనట్లేనా..?

కిషన్ రెడ్డికి రాష్ట్రంపై ప్రేమ వుంటే 10 మెడికల్ కాలేజీలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హరీశ్ కోరారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ (navodaya schools) పాఠశాల ఏర్పాటు చేయాలని పార్లమెంట్ చట్టం చేసిందని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలుగా మార్చడం వీలుకాదని లక్ష్మారెడ్డి లేఖకు జేపీ నడ్డా రిప్లయ్ (jp nadda) కూడా ఇచ్చారని మంత్రి చెప్పారు. ఫేజ్ 3లో మెడికల్ కాలేజీలను పరిశీలిస్తామని కేంద్రమంత్రి హర్షవర్థన్ (harsha vardhan) అన్నారని హరీశ్ చెప్పారు. 

రాజస్థాన్‌కు 23, మధ్యప్రదేశ్‌కు 12, పశ్చిమ బెంగాల్‌కు 12, తమిళనాడుకు 11 మెడికల్ కాలేజీలు ఇచ్చారని కానీ.. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించారని మంత్రి దుయ్యబట్టారు. ఎన్సీడీసీకి మూడెకరాలు ఇవ్వాలని ఐసీఎంఆర్‌కు లేఖ రాసినా స్పందన లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం రెండే మెడికల్ కాలేజీలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. పంజాబ్‌లో ప్రతి గింజా కొని.. తెలంగాణలో ఎందుకు కొనరని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎయిమ్స్ కోసం రెడీగా వున్న బీబీనగర్ నిమ్స్ (bb nagar nims) ఆసుపత్రిని ఇచ్చేశామని మంత్రి గుర్తుచేశారు. 
 

click me!