కాంగ్రెస్‌తో పొత్తుతో తెలంగాణలో పాగాకు బాబు ప్లాన్: హరీష్‌

By narsimha lodeFirst Published Oct 26, 2018, 1:22 PM IST
Highlights

ఆంధ్రాపార్టీ అని టీడీపీని  పొలిమేరల వరకు తరిమేస్తే ... కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోందని  తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
 


హైదరాబాద్: ఆంధ్రాపార్టీ అని టీడీపీని  పొలిమేరల వరకు తరిమేస్తే ... కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోందని  తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

కొడంగల్ నియోజకవర్గానికి చెందిన  పలు పార్టీలకు చెందిన నేతలు, కుల సంఘాల నాయకులు శుక్రవారం నాడు  టీఆర్ఎస్ భవనంలో  మంత్రి హరీష్ రావు సమక్షంలో  టీఆర్ఎస్‌లో చేరారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబు పల్లకిని మోస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. మహా కూటమి గెలిస్తే  టీడీపీకి రెండు మంత్రి పదవులు ఇస్తారని ఒప్పందం కుదిరిందన్నారు.  ఒకటి సాగునీటి శాఖ, మరోకటి హోంశాఖలు తీసుకొని తెలంగాణకు టీడీపీ అన్యాయం చేసేందుకు ప్లాన్ చేసిందని హరీష్ రావు మండిపడ్డారు.

మహాకూటమి గెలిచే సత్తా లేదన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడ ఆ కూటమికి దక్కదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. నలభై రోజుల పాటు టీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడాలని ఆయన  కార్యకర్తలను కోరారు. టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే అరవై నెలలపాటు  మీ కోసం మేం కష్టపడతామని  హరీష్ రావు  హమీ ఇచ్చారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా కూడ ఇవ్వనని చెబితే టీఆర్ఎష్ పోరాటం చేసిందన్నారు. కానీ, ఈ ప్రకటనకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు బల్లలు చరిచారని ఆయన గుర్తుచేశారు.  చంద్రబాబు కూడ పాలమూరుకు నీళ్లు రాకుండా ఉండేందుకు  కేంద్రానికి లేఖలను రాస్తున్నాడని ఆయన చెప్పారు.
 

click me!