100 స్థానాల్లో గెలుపు ఖాయం: మంత్రి హరీష్ రావు

Published : Sep 24, 2018, 06:09 PM IST
100 స్థానాల్లో గెలుపు ఖాయం: మంత్రి హరీష్ రావు

సారాంశం

టీఆర్ఎస్ పార్టీపై ప్రజల స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయమనిపిస్తోందని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటతప్పని మడమ తిప్పని నాయకుడని హరీష్ రావు కొనియాడారు.

సిద్దిపేట: టీఆర్ఎస్ పార్టీపై ప్రజల స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయమనిపిస్తోందని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటతప్పని మడమ తిప్పని నాయకుడని హరీష్ రావు కొనియాడారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవీ..చెప్పవనవీ అమలు చేశామని హరీష్ రావు తెలిపారు.కేసీఆర్‌ నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గం దేశానికే రోల్ మోడల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు హరీష్ రావు. కాంగ్రెస్ ఎన్ని కూటమిలు కట్టినా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కోతలు, ఎరువుల కొరత తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు గెలవమని తెలిసి ఆపద మొక్కులు మొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ఓడిపోయే నాయకులే మాటలెక్కువ మాట్లాడుతారని విమర్శించారు.  

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌