వరవరరావు ఇంటి వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

By Nagaraju TFirst Published Sep 24, 2018, 5:49 PM IST
Highlights

 విరసం నేత వరవరరావు నివాసం వద్ద ఏబీవీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టుల దాడికి వరవవరరావును బాధ్యుడిని చెయ్యాలంటూ గాంధీనగర్ లోని ఆయన ఇంటిని ముట్టడించారు. 

హైదరాబాద్: విరసం నేత వరవరరావు నివాసం వద్ద ఏబీవీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టుల దాడికి వరవవరరావును బాధ్యుడిని చెయ్యాలంటూ గాంధీనగర్ లోని ఆయన ఇంటిని ముట్టడించారు. వరవరరావు ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వరవరరావు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

అరకు ఘటనలో విరసం నేత వరవరరావును బాధ్యుడిని చేస్తూ కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం పారాటం చేస్తున్న ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ఖండించారు. మావోయిస్టుల హత్య దుర్మార్గపు చర్య అని అభిప్రాయపడ్డారు. 

click me!