బీజేపీ ట్రాప్‌లో పడొద్దు .. టీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ పిలుపు, మేమూ ఫైట్ చేయగలమంటూ వార్నింగ్

By Siva KodatiFirst Published Nov 1, 2022, 3:26 PM IST
Highlights

మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. వాళ్లపై వాళ్లే దాడి చేసుకుని టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ దాడి చేసిందని ఆయన ఆరోపించారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సమన్వయం పాటించాలన్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలవబోతోందనే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ కుట్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు పడొద్దని.. తాము కూడా గట్టిగా ఫైట్ చేయగలమన్నారు. వాళ్లపై వాళ్లే దాడి చేసుకుని టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso REad:మునుగోడు ఉపఎన్నిక.. ఈటల కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణుల రాళ్ల దాడి, పరిస్ధితి ఉద్రిక్తం

Latest Videos

కాగా.. ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా సాగిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం చివరి రోజు ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మునుగోడు మండలం పలివెలలో మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అయితే దీనికి వెంటనే స్పందించిన బీజేపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి. ఇరు పార్టీల శ్రేణులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. ఈ దాడిలో ఈటల కారు అద్దాలు ధ్వంసమవ్వగా.. ఆయన పీఆర్వో కాలికి గాయమైంది. అటు బీజేపీ కార్యకర్తల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ జగదీశ్‌కు గాయాలయ్యాయి. 

click me!