పాపం చంద్రబాబు అరెస్టైనట్టున్నారు.. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Google News Follow Us

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో రంగనాయకస్వామి బీ ఫార్మసీ కళాశాలను మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణలో ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేకుండా అభివృద్దిలో ముందుకు సాగుతున్నామని హరీష్ రావు చెప్పారు. 

పాపం చంద్రబాబు అరెస్టైనట్టున్నారు.. మాట్లాడుకూడదేమో గానీ, గతంలో చంద్రబాబు ఐటీ ఐటీ అనేవాడని అన్నారు. అయితే కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌లో ఐటీతో పాటు పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ది జరిగిందని అన్నారు. భారతదేశంలో ఐటీ ఉత్పత్తుల్లో బెంగళూరు కంటే  హైదరాబాద్ నెంబర్ స్థానంలో ఉందన్నారు. ఐటీ ఉద్యోగాలలో కూడా హైదరాబాద్  మెరుగ్గా ఉందన్నారు. అన్ని రంగాల గురించి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించిందని అన్నారు. 

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతి కల్పించారు. ఒక సహాయకుడిని కూడా అనుమతించారు. ఐదుగురు సిబ్బందితో భద్రత కల్పించారు.