గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

Published : Sep 11, 2023, 12:28 PM IST
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

సారాంశం

బీఆర్ఎస్ నేత బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.

బీఆర్ఎస్ నేత బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై  తెలంగాణ హైకోర్టు  అనర్హత వేటేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఈసీ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

ఇక, గత ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై  తెలంగాణ హైకోర్టు  అనర్హత వేటేసింది.ఈ ఏడాది ఆగస్టు  24న  హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.  గత ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన  మాజీ మంత్రి డీకే అరుణను  గద్వాల ఎమ్మెల్యేగా  హైకోర్టు ప్రకటించింది. తనపై ఉద్దేశ్యపూర్వకంగా  తప్పుడు కేసులు పెట్టారని  గద్వాల  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టులో  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?