హైదరాబాద్ లో ఫ్రెంచ్ మహిళ మృతి, దత్త పుత్రిక అరెస్ట్

Published : Sep 13, 2021, 11:52 AM IST
హైదరాబాద్ లో ఫ్రెంచ్ మహిళ మృతి, దత్త పుత్రిక అరెస్ట్

సారాంశం

దర్యాప్తులో భాగంగా సదరు మహిళ కుటుంబసభ్యులను పోలీసులు విచారించగా.. ఆమె దత్తత కుమార్తె రోమా(34) పై ఎక్కువ ఫిర్యాదులు అందాయి.

హైదరాబాద్ లో ఓ ఫ్రెంచ్ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మూడురోజుల పాటు కనిపించకుండా పోయిన సదరు ఫ్రెంచ్ మహిళ... ఆ తర్వాత శవమై కనిపించింది.  చెట్ల పొదల్లో ఆమె శవమై కనిపించడం గమనార్హం. కాగా.. ఈ సంఘటన హిమాయత్ సాగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాగా..  ఈ ఘటనలో  సదరు ఫ్రెంచ్ మహిళ దత్తత కుమార్తె ను పోలీసులు అరెస్టు చేశారు.  గత గురువారం.. పోలీసులకు  హైదరాబాద్ లో స్థిరపడిన ఫ్రెంచక్ష్ మహిళ మరే క్రిస్టీన్(68) గండిపేటలో కనిపించకుండా పోయిందని ఫిర్యాదు అందింది. కాగా.. మూడు రోజుల తర్వాత ఆమె శవమై కనిపించింది.

కాగా.. దర్యాప్తులో భాగంగా సదరు మహిళ కుటుంబసభ్యులను పోలీసులు విచారించగా.. ఆమె దత్తత కుమార్తె రోమా(34) పై ఎక్కువ ఫిర్యాదులు అందాయి. ఆమెను పోలీసులు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా.. మహిళను చంపేసినట్లు తెలిసింది. కాగా.. ఈ కేసులో రోమాతో పాటు.. ఇమె ఇద్దరు స్నేహితులు విక్రమ్ శ్రీరాములు, రాహుల్ గౌతమ్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మేరీ .. తన కూతురు రోమాకి పెళ్లిచేయాలని అనుకుంది. దీంతో.. రెండు నెలల క్రితం ఆమె డీటైల్స్ ని ఓ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో పెట్టారు. కాగా.. వీరికి ఆ వెబ్ సైట్ లో విక్రమ్ అనే యువకుడి పరిచయం ఏర్పడింది. అయితే.. ఈ మ్యాచ్ మేరీకి నచ్చలేదు. తల్లికి నచ్చకున్నా.. రోమా.. విక్రమ్ తో కలిసి కొండాపూర్ లో సహజీవనం మొదలుపెట్టింది.

కాగా.. మేరీ.. కూతురిని అతనితో ఉండవద్దని కోరింది. ఈ క్రమంలో తమ పెళ్లికి  తల్లిఅడ్డుగా ఉందనే కోపంతో.. రోమా. ఆమెను చంపేయాలని నిర్ణయం తీసుకుంది. పథకం ప్రకారం చంపేసింది. కాగా.. పోలీసులు కేసు చేధించడంతో.. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు