ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకే: కోస్గి సభలో హరీష్ రావు సంచలనం (వీడియో)

By narsimha lode  |  First Published Oct 4, 2023, 1:14 PM IST

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని  తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ కోస్గిలో నిర్వహించిన సభలో హరీష్ రావు ప్రసంగించారు.


 కోస్గి:ఓటుకు నోటు కేసులోరేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని తెలంగాణ మంత్రి  హరీష్ రావు చెప్పారు.ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసిందని హరీష్ రావు తెలిపారు. ఈ కేసులో  రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లేది ఖాయమన్నారు మంత్రి కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని బుధవారంనాడు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.  మంత్రి హరీష్ రావుతో పాటు  మంత్రి మహేందర్ రెడ్డి కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు.

కొడంగల్ కు రేవంత్ రెడ్డి ఒక్క సర్కారు దవాఖాన తీసుకురాలేదన్నారు. తమ ప్రభుత్వం మూడు ఆసుపత్రులు కొడంగల్ నియోజక వర్గానికి మంజూరు చేసిందన్నారు.నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే,నేడు నేను సర్కారు దవాఖనకే పోతా అంటున్నారని హరీష్ రావు చెప్పారు.కొడంగల్ లో 46 తండాలు గ్రామ పంచాయతీలు చేశామన్నారు. నారాయణ్ పేట్ లో 180 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేసిన విషయాన్ని  మంత్రి గుర్తు చేశారు. ఇక్కడి ప్రజల మంచి నీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ అని ఆయన చెప్పారు.  కొడంగల్ ఎమ్మెల్యేగా నరేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీళ్లు సరఫరా అవుతున్నాయన్నారు. 

Latest Videos

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే పదేళ్లు అయినా మంచి నీళ్ళు రాకపోయేవని హరీష్ రావు విమర్శించారు. కృష్ణా నీళ్ళు నార్లాపుర్ వచ్చాయన్నారు.మాటలు కావాలంటే రేవంత్ రెడ్డి దిక్కు, అభివృద్ధి కావాలంటే నరేందర్ రెడ్డి దిక్కు ఉండాలని హరీష్ రావు తెలిపారు.మొత్తం లక్షా 50 వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామన్నారు.వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, 24 గంటల కరెంట్ దండగ అని రేవంత్ రెడ్డి  అన్నారని హరీష్ రావు విమర్శించారు. మూడు గంటల కరెంట్ చాలు అని కడుపులో ఉన్నది భయట పెట్టారని  రేవంత్ రెడ్డిపై  హరీష్ రావు మండిపడ్డారు.

మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్, 24 గంటల కరెంట్ కావాలంటే బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.ఇక్కడ పని చేయలేదని ఓడిస్తే.. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి పోటీ చేశారని  హరీష్ రావు తెలిపారు.మీ పక్కనే కర్ణాటక ఉంది. అక్కడ కల్యాణ లక్ష్మి ఉందా. 12 లక్షల పెళ్లిళ్లకు 11 వేల కోట్లు కేసీఆర్ ఇచ్చారన్నారు. 

కర్ణాటకలో మూడు రోజులకు ఒకరోజు నీళ్ళు, రూ. 600 పెన్షన్లు ఇస్తున్నారన్నారు. కానీ, తెలంగాణలో రూ. 2000 పెన్షన్ ఇస్తున్నామని హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ ఎలా ఇస్తారని  కాంగ్రెస్ ను ప్రశ్నించారు.తెలంగాణలో బిజెపి లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బి ఆర్ ఎస్ అని తేలిందన్నారు.గెలిచేది, వచ్చేది బి ఆర్ ఎస్ పార్టీ అని ఆయన చెప్పారు.ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు.

also read:ఓటుకు నోటు కేసు: రేవంత్ పిటిషన్ పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు

మహిళల కోసం సీఎం అనేక కార్యక్రమాలు చేశారన్నారు.  కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్, గృహలక్ష్మి వంటి పథకాలను కేసీఆర్ తీసుకు వచ్చిన విషయాలను ఆయన గుర్తు చేశారు. త్వరలోనే మేనిఫెస్టో వస్తుందన్నారు. మహిళలను మరింత బలోపేతం చేసే విధంగా  మేనిఫెస్టో ఉంటుందని హరీష్ రావు చెప్పారు.మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయని ఆయన వివరించారు.

click me!