
సిద్దిపేట: తన బిజీ షెడ్యూల్ లోనూ రోడ్డు ప్రమాదానికి గురయిన కుటుంబాన్ని కాపాడేందుకు స్వయంగా ముందుకొచ్చారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. క్షతగాత్రులను దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి సిద్దిపేట హాస్పిటల్ కు పంపించారు. ఇలా మంత్రి హరీష్ ఓ కుటుంబాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలతో పాటు చిన్నారులు గాయపడ్డారు.
వీడియో
అయితే ఇదే సమయంలో అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి వీరిని గమనించారు. గాయాలతో పడివున్న కుటుంబాన్ని చూసి చలించిపోయిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ ని ఆపి వారికి సాయం చేశారు. దగ్గరుండి క్షతగాత్రులను అంబులెన్స్ ఎక్కించడమే కాదు జేబులోంచి కొంత డబ్బును తీసి వారికి ఇచ్చారు. అలాగే అంబులెన్స్ డ్రైవర్ ను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించాలని సూచించారు.
read more మిర్యాల గూడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
ఇలా స్వయంగా మంత్రి హరీష్ రావు రోడ్డుపై గాయాలతో పడివున్న వారిని కాపాడేందుకు చూపిన చొరవను స్థానికులు అభినందిస్తున్నారు. ఇలా మానవత్వాన్ని చాటుకుని ప్రజల మనసుల్లో మరింత స్థానాన్ని సంపాదించారు మంత్రి హరీష్.