సొంతింటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టిన మంత్రి హరీష్ రావు

By Arun Kumar PFirst Published Jan 21, 2021, 10:29 AM IST
Highlights

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయించి ఆర్థికంగా అండగా నిలిచారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.

సిద్దిపేట:  ప్రస్తుత రాజకీయాల్లో అధికార అండతో ప్రజా ధనాన్ని దోచుకుని భారీగా ఆస్తులు కూడబెట్టుకునే నాయకులనే మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ ప్రజల కోసం తాపత్రయపడే వారికి మంచి చేయాలన్న తాపత్రయం వున్న నాయకులు అతి తక్కువమంది. కానీ ప్రజల కోసం సొంత ఆస్తులను వదులుకోడానికి సిద్దపడ్డ నాయకులను మనం ఇప్పటివరకు చూడలేదు. కానీ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆ పనిచేసి ప్రజా శ్రేయస్సు కోసం తాను ఏమయినా చేస్తానని నిరూపించాడు. 

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో రెక్కాడితే గాని డొక్కాడని ఎన్నో జీవితాలు రోడ్డునపడ్డాయి. ఇలా ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారిన ఆటో డ్రైవర్లకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వారి దయనీయ పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయిన మంత్రి వారి జీవితాలకు భరోసా కల్పించే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఏ రాజకీయ నాయకుడు చేయని పని చేశారు.

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయించి ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేనందున మూలధనం కోసం మంత్రి తన సొంత ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు. ఇలా వచ్చిన రూ.45 లక్షల రుణాన్ని  ఈ పరపతి సంఘంలో జమచేయించారు. 

ఇలా తన సొంత స్థలాన్ని తనఖా పెట్టి ఆటోడ్రైవర్లకు అండగా నిలిచిన మంత్రి హరీష్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. కష్టకాలంలో తమకోసం సొంత ఆస్తిని వదులుకోడానికి సిద్దపడ్డ మంత్రికి తమ కుటుంబాలన్నీ జీవితాంతం రుణపడి ఉంటామని ఆటోడ్రైవర్లు పేర్కొన్నారు.

click me!