ప్రేమోన్మాదికి యావజ్జీవ కారాగార శిక్ష

Published : Jan 21, 2021, 09:30 AM ISTUpdated : Jan 21, 2021, 09:32 AM IST
ప్రేమోన్మాదికి యావజ్జీవ కారాగార శిక్ష

సారాంశం

 ఆ యువతి అతని ప్రేమను అంగీకరించలేదు. దీంతో.. 2018 ఆగస్టు 7వ తేదీన ఆర్ట్స్ కళాశాల రైల్వే స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ కార్వర్ట్స్ లో యువతి గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేుసులో అప్పట్లోనే వెంకట్ ని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రేమోన్మాదంతో యువతిని అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఓ యువకుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇన్ స్పెక్టర్ రమేష్ నాయక్ తెలియజేశారు.  వారాసిగూడకు చెందిన ఆరెపల్లి వెంకట్(25), బౌద్ధనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

అయితే.. ఆ యువతి అతని ప్రేమను అంగీకరించలేదు. దీంతో.. 2018 ఆగస్టు 7వ తేదీన ఆర్ట్స్ కళాశాల రైల్వే స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ కార్వర్ట్స్ లో యువతి గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేుసులో అప్పట్లోనే వెంకట్ ని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా.. విచారణ అనంతరం బుధవారం నాంపల్లిలోని రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి.. ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.నారాయణ వాదించారు. 

PREV
click me!

Recommended Stories

Kondagattu పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని Pawan Kalyan ఎందుక‌న్నారు? | Anjaneya Swamy | Asianet News Telugu
MLA Medipally Satyam Emotional Words: ఆంజనేయస్వామే పవన్ కళ్యాణ్ గారినికాపాడారు | Asianet News Telugu