పెంట్ హౌస్ కి రూ.70వేలు కరెంటు బిల్లు.. యజమానికి షాక్..!

Published : Jan 21, 2021, 10:04 AM IST
పెంట్ హౌస్ కి రూ.70వేలు కరెంటు బిల్లు.. యజమానికి షాక్..!

సారాంశం

ఆ యజమాని అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అధికారులు మొదట డబ్బుకట్టి తరువాత సమస్య పరిష్కరించుకోండి అంటూ చెప్పడంతో అయోమయంలో పడ్డాడు. 


పెంట్ హౌస్ కి ఓ వ్యక్తికి ఏకంగా రూ.70వేలు కరెంట్ బిల్లు వచ్చింది. ప్రతి నెలా రూ.500 రాగా.. ఈ నెల రూ.70వేలకు పైగా రావడంతో.. ఆ ఇంటి యజమాని షాక్ అయ్యాడు. దీంతో ఆ యజమాని అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అధికారులు మొదట డబ్బుకట్టి తరువాత సమస్య పరిష్కరించుకోండి అంటూ చెప్పడంతో అయోమయంలో పడ్డాడు. 

వివరాల్లోకి వెళితే..... బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ గ్రామంలో చేవెళ్ల నర్సారెడ్డి కాలనీకి చెందిన బాల్‌రెడ్డి తన ఇంటి పెంట్‌హౌ‌స్‌కు ప్రత్యేకంగా ఓ మీటర్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో పెంట్‌ హౌస్‌ బిల్లు రాకపోవడంతో పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదు. అయితే ఇప్పుడు ఏకంగా 70వేల 939 బిల్లు చేతిలో పెట్టారు. తొందరగా బిల్లును కట్టితీరాలని హుకుం జారీ చేశారు. ఇంటి యజమానికి ఆ బిల్లు అందించడంతో లబోదిబోమంటున్నాడు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాల్‌రెడ్డి కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?