వాట్సాప్‌లోనే కాదు.. పార్లమెంట్‌లోనూ అబద్ధాలే , ఆ కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలి: హరీశ్‌రావు ఆగ్రహం

Siva Kodati |  
Published : Mar 22, 2022, 09:12 PM IST
వాట్సాప్‌లోనే కాదు.. పార్లమెంట్‌లోనూ అబద్ధాలే , ఆ కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలి: హరీశ్‌రావు ఆగ్రహం

సారాంశం

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. గిరిజన బిల్లుకు ఆమోదం లభించే వరకు కేంద్రం వెంట పడుతూనే వుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

ఎస్టీ  రిజర్వేషన్ల పెంపు (st reservation) కోసం  తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందన్నారు టీఆర్ఎస్ నేత (trs), మంత్రి హరీశ్ రావు (harish rao). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల మనోభావాలను కేంద్రం దెబ్బతీసిందని పేర్కొన్నారు. అది ఏమైనా ప్రభుత్వమా.. లేక ప్రైవేట్ కంపెనీనా అని హరీశ్ ప్రశ్నించారు. ఎస్టీ రిజర్వేషన్లు ఎప్పుడిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) కేంద్రాన్ని ప్రశ్నించాలని మంత్రి పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ప్రధానిని సీఎం కేసీఆర్ కలిసి అడిగారని హరీశ్ గుర్తుచేశారు. 

కేంద్ర మంత్రులకు రాసిన లేఖలకు రిప్లైలు కూడా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని హరీశ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి అనడం సరికాదని ఆయన దుయ్యబట్టారు. వాట్సప్‌లోనే కాదు.. పార్లమెంట్‌లోనూ అబద్ధాలు చెబుతున్నారంటూ హరీశ్ సెటైర్లు వేశారు. పార్లమెంట్‌కు తప్పుడు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. 

అంతేకాదు కేంద్రమంత్రి తక్షణం క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. మా ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారని హరీశ్ పేర్కొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు (tribals) , అన్ని యూనివర్సిటీల్లో నిరసనలకు పిలుపునిస్తున్నామన్నారు. గిరిజన  బిల్లు ఆమోదించే దాకా బీజేపీ (bjp) వెంటపడుతామని, వదిలిపెట్టబోమని హరీశ్ హెచ్చరించారు. అబద్దాల బీజేపీ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి బిల్లు ఆమోదం అయ్యేలా చూడాలని ఆయన కోరారు. 

మరోవైపు .. యాసంగిలో Paddy ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం నాడు Delhiకి బయలు దేరింది. Punjab  రాష్ట్రం నుండి కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది.ఈ విషయమై కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిసేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు.

సోమవారం నాడు TRS శాసనసభపక్ష సమావేశం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశం తర్వాత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని  ఈ సమావేశం డిమాండ్ చేసింది. కేసీఆర్ ఆదేశం మేరకు ఇవాళ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆహార్ శాఖ మంత్రి Piyush Goyal  ను కలిసి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోతే తెలంగాణ తరహలోనే పోరాటం నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..