
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి స్వగ్రామమైన మామిడాల పల్లిలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆ గ్రామానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మామిడాల పల్లి లో 90 శాతం ఓట్లు trs పార్టీకి పడితే ఈ గ్రామాన్ని స్వయంగా తానే దత్తత తీసుకుంటానని... ఎన్నికల తర్వాత జిల్లా కలెక్టర్ ను తీసుకువచ్చి దగ్గరుండి మరీ అభివృద్ధి పనులు చేయిస్తానని harish rao హామీ ఇచ్చారు.
హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం mamidalapalli లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో పుట్టిపెరిగి మంత్రిగా సేవలందించిన దివంగత muddasani damodar reddy ని హరీష్ గుర్తుచేసారు. ముద్దసాని పేరు నిలబెట్టే విధంగా మామిడాలపల్లిలో కార్యక్రమాలు చేపడతామని... ముద్దసాని తనయుడు కశ్యప్ రెడ్డితో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు.
వీడియో
''ముద్దసాని దామోదర్ రెడ్డి అంటే మాకు ఎంతో ప్రేమ గౌరవం. తప్పకుండా ఆ గౌరవం కాపాడతా. తెలంగాణ రాక ముందు రైతులు ఎంతో గోస పడేవారు. ఆనాడు రైతుల కోసం దామోదర్ రెడ్డి తెగించి కాల్వలకు గండి కొడితేనే పొలాలకు నీళ్లు వచ్చేవి. ఇలా ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. రైతుల గురించి దామోదర్ రెడ్డి తపన పడ్డారు'' అని హరీష్ అన్నారు.
READ MORE Huzurabad bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించిన ఈసీ
''దామోదర్ రెడ్డి కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా నేడు వీణవంక మండలంలో గోదావరి జలాలు కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతున్నాయి. గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిపించి మరింతగా అభివృద్ది జరిగేలా చూడండి'' అని మంత్రి హరీష్ సూచించారు.
90 శాతం ఓట్లు టిఆర్ఎస్ పార్టీకే వేస్తామని మంత్రి హరీష్ రావుకు గ్రామస్తులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ఓటేస్తామన్న మామిడాలపల్లి వాసులకు మంత్రి హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.
VIDEO Huzurabad bypoll: పాత మిత్రులు హరీష్ రావు, ఈటల మధ్య పోటీలాగా
ఇదిలావుంటే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన రోజే (అక్టోబర్ 1వ తేదీన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఇక నామినేషన్ చివరిరోజు కూడా మంత్రి హరీష్ తో కలిసి మరో సెట్ నామినేషన్ వేసారు.
ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. ఇక అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలింది. పోలింగ్ కు సమయం దగ్గరపడటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు gellu srinivas yadav, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు balmoor venkat (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు.