తెలంగాణలో షర్మిల, చంద్రబాబు , పాల్‌‌కు ఏం పని.. మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 18, 2022, 05:24 PM IST
తెలంగాణలో షర్మిల, చంద్రబాబు , పాల్‌‌కు ఏం పని.. మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

సారాంశం

షర్మిల, చంద్రబాబు , పాల్‌లపై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు దాడులు తప్ప ఏం చేయలేవని.. దాడికి ప్రతి దాడి తప్పదన్నారు. 

మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై షర్మిల, చంద్రబాబు , పాల్‌కు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. పచ్చని తెలంగాణలో మళ్లీ చిచ్చు పెడుతున్నారని.. తెలంగాణపై కావాలనే దాడులు చేస్తున్నారని మంత్రి గంగుల మండిపడ్డారు. ప్రతిపక్షాలు దాడులు తప్ప ఏం చేయలేవని.. దాడికి ప్రతి దాడి తప్పదన్నారు. 

బీజేపీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే అర్వింద్, కల్వకుంట్ల కవితల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. 

Also REad:మీ దాడులకు మేం భయపడం... ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ

అంతకుముందు తన ఇంటిపై దాడిపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో  పోటీ చేయాలని  కవితకు సవాల్  విసిరారు. ఇంకా దొరల పాలన సాగుతుందని  అనుకొంటున్నారా  అని  ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్  శ్రేణులు దాడి చేసి  మహిళలను  భయపెట్టారని, తన తల్లిని బెదిరించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్  పార్లమెంట్ లో పోటీచేస్తావా  చేయాలని  కవితకు అరవింద్ సవాల్ చేశారు. విమర్శలు చేస్తే దాడి చేస్తారా  అని  అర్వింద్ ప్రశ్నించారు

గత  పార్లమెంట్  ఎన్నికల సమయంలో  పోటీచేసిన 178 మందిలో 71 మంది పసుపు రైతులు బీజేపీలో చేరారన్నారు. తనపై చీటింగ్ కేసు  ఏం వేస్తావని  ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్  అని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ పై చీటింగ్  కేసు  పెట్టాలని కవితకు  సలహా ఇచ్చారు  ఎంపీ అర్వింద్. రైతులు  గుంపులు గుంపులుగా  బీజేపీలో చేరుతున్నారన్నారు. 0 ఏళ్ల  వయస్సున్న తన తల్లిని   భయపెట్టే  హక్కు  ఎవరిచ్చారని  అరవింద్  ఆగ్రహం వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!
Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu