బతుకమ్మ నాడు-నేడు... కేసీఆర్ సోదర ప్రేమకు విలువ కడతారా..: గంగుల సీరియస్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 04, 2021, 04:21 PM IST
బతుకమ్మ నాడు-నేడు... కేసీఆర్ సోదర ప్రేమకు విలువ కడతారా..: గంగుల సీరియస్ (వీడియో)

సారాంశం

సీఎం కేసీఆర్ సోదర ప్రేమతో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందిస్తుంటే వాటికి విలువకట్టి రాజకీయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మంత్రి గంగుల మండిపడ్డారు. 

కరీంనగర్: ప్రపంచంలోని అన్ని దేశాల్లో క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఇతర అన్ని మతాల్లోనూ పూలతో దేవున్ని ప్రార్థిస్తారని... కానీ కేవలం తెలంగాణలో మాత్రమే పూలనే దేవీదేవతల ప్రతిరూపంగా కొలిచే గొప్ప సంస్కృతి ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్.  తీరొక్క పూలను పేర్చి... పూలలో గౌరమ్మని ఉంచి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని గంగుల అన్నారు. ఇలాంటి గొప్ప పండగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల్ని పంచే అవకాశం కలిగిందని... ఇందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు గంగుల. 

సోమవారం కరీంనగర్ పట్టణంలోని 14, 35వ డివిజన్లకు సంబందించి సప్తగిరి కాలనీ మాచర్ల గార్డెన్స్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల  బతుకమ్మ చీరలు అందిస్తూ ఆడబిడ్డలకు పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుతున్నానని మంత్రి తెలిపారు. 

వీడియో

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... నీటిని, గాలిని, గుట్టని, భూమిని కొలుస్తూ ప్రకృతితో మమేకమయ్యే సంస్కృతి మనది అని అన్నారు. దేశంలో ప్రకృతిని దేవునిగా కొలిచే ప్రజలు తెలంగాణ వారన్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మను సొంత వారి మద్య,  పుట్టింట్లో తల్లిదండ్రుల చెంతన ఘనంగా ఆడబిడ్డలు జరుపుకుంటారన్నారు. ఈ గొప్ప వేడుకను మరింత వైభవంగా జరుపుకునేలా ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి చీరలు పెడుతున్నారని అన్నారు. 
 
''ఎంగిలిపూల చిన్న బతుకమ్మ మొదలు సద్దుల పెద్ద బతుకమ్మ దాకా కరీంనగరంలో ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. తెలంగాణకు పూర్వం నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నిరసన తెలుపుతూ బతుకమ్మ ఆడితే అరెస్టు చేసారు. కానీ ఈనాడు ఉద్యమనేత కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం నాడు అరెస్టు చేసిన పోలీసుల ఎదుటే బతుకమ్మను వేడుకగా చేసారు. అది మన బతుకమ్మ తల్లి దీవెన, శక్తి'' అని గంగుల అన్నారు. 

''ఆనాడు మానేరులో నిండుగా నీళ్లున్నప్పటికి ఆడబిడ్డలు బిందెలతో ట్యాంకర్ల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి వుండేది. గతంలో బతుకమ్మలని వేయడానికి నీల్లు లేక మానేరు నడిమద్యలో వేసేవారిమి. ఆనాడు బతుకమ్మ ఆడాలంటే నిషేదం వుండేది. ఇలాంటి పరిస్థితుల్ని రూపుమాపాలనే సీఎం కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాదించారు. నేడు అంగరంగ వైభవంగా 24గంటల కరెంటు, కాళేశ్వరం నీళ్లు, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్లు ఇలా అన్ని రంగాల్లో అద్బుతంగా రాణిస్తున్నాం'' అన్నారు.

read more  తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి.. శాసనసభలో సీఎం కేసీఆర్ ఫైర్..

''ఆడబిడ్డల పెళ్లి భారంగా మారొద్దని కళ్యాణలక్ష్మీ ఇవ్వడమే కాకుండా కానుపుకు రూ.13వేల కేసీఆర్ కిట్ ను కానుకగా అందిస్తున్నాం. గురుకులాల్లో అద్బుతమైన విద్యని అందిస్తున్నాం. అదే స్పూర్తితో మన ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరల్ని కూడా అందిస్తున్నాం'' అన్నారు. 

''కొందరు అవకాశవాదులు చీరలతో కూడా రాజకీయం చేస్తున్నారు. సోదరసోదరీమణుల ప్రేమకు చిహ్నంగా విలువతో సంబందం లేకుండా పదిరూపాయల రాఖీ కట్టుకొని సంబురపడుతామని... అలాగే నేడు కేసీఆర్ ప్రేమతో అందిస్తున్న ఆడబిడ్డ కట్నాన్ని హేళన చేస్తున్న ప్రతిపక్షాలు బుద్దితెచ్చుకోవాలి. చీరల్ని కాల్చడమనేది మన సంస్కృతి కాదు. ఏ ఆఢబిడ్డ చీరల్ని తగులబెట్టదని... అలాంటిది ఇంత నీచ రాజకీయాలు చూస్తుంటే జుగుప్స కలుగుతుంది'' అని మంత్రి గంగుల మండిపడ్డారు. 
 
''కేసీఆర్ ప్రేమతో అందిస్తున్న కానుకతో ఆడబిడ్డలంతా సంబురంగా పండుగ చేసుకుంటున్నారు. ఆడబిడ్డల దీవెనలతో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నసీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆశీర్వదించాలి'' అని మహిళలను కోరారు మంత్రి గంగుల. 

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?