రాంగ్‌రూట్‌లో వాహనం: చలాన్ చెల్లించిన కేటీఆర్, ట్రాఫిక్ సిబ్బందికి అభినందన

By narsimha lodeFirst Published Oct 4, 2021, 3:39 PM IST
Highlights

తన వాహనానికి చలాన్ విధించిన ట్రాపిక్ ఎస్ఐ అయిలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును మంత్రి కేటీఆర్ అభినందించారు. తన వాహనానికి విధించిన చలాన్ ను మంత్రి సోమవారం నాడు చెల్లించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్:  రెండు రోజుల క్రితం తన వాహనం రాంగ్‌రూట్ (wrong route)లో వెళ్లడంతో  ట్రాఫిక్ (traffic) పోలీసులు విధించిన చలాన్ ను (challan)తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) చెల్లించారు. 

also read:రాంగ్ రూట్ లో కేటీఆర్ కారు: అడ్డుకున్న ట్రాఫిక్ ఎఎస్సై, తోసేసి గులాబీ దండు

గాంధీ జయంతి రోజున  హైద్రాబాద్ లో(hyderabad)  మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్ రూట్ లో వెళ్లింది.అయితే ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే మంత్రి కేటీఆర్ వాహనానికి చలాన్ విధించారు. మంత్రి కేటీఆర్ వాహనానికి చలాన్ విధించడంపై  కొందరు టీఆర్ఎస్ (trs)నేతలు ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు చేశారు.

 రెండు రోజుల క్రితం రాంగ్ రూట్ లో తన వాహనం వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్ ను మంత్రి కేటీఆర్ సోమవారం నాడు చెల్లించారు.తన వాహనానికి చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ అయిలయ్య(ailaiah), కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (venkateshwarlu)ను ఆయన  అభినందించారు మంత్రి కేటీఆర్.నిబంధనలు ప్రజలకైనా ప్రజా ప్రతినిధులకైనా ఒకటేనని ఆయన చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎప్పుడూ అండగా ఉంటామని మంత్రి తెలిపారు.

click me!