gangula on bandi sanjay : బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదు .. గంగుల ఫైర్

By Rajesh KFirst Published Jan 3, 2022, 3:31 AM IST
Highlights

Gangula Kamalakar : బండి సంజ‌య్ చేప‌ట్టిన దీక్షపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.  బండి సంజ‌య్..  గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికే దొంగ దీక్ష చేప‌ట్టార‌ని మంత్రి గంగుల  ఆరోపించారు.  క‌రోన నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉన్న నేప‌ధ్యంలో ఒక ఎంపీ గా  చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఢీల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్‌ చేయాదా? అని బండి సంజ‌య్ ని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు 317 జీవో ఇచ్చామని, ఈ జీవో వ‌ల్ల ఏ ఉద్యోగి బాధ‌ప‌డ‌టం లేదని, అని ఉద్యోగ సంఘాలు ఈ జీవోని ఆమోదించాయని తెలిపారు. 
 

Gangula Kamalakar :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాగరణ దీక్షపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. బండి సంజ‌య్ ది జాగ‌ర‌ణ దీక్ష కాద‌నీ,  క‌రోనాను వ్యాప్తి చేసే దీక్ష అని మంత్రి గంగుల కమలాకర్​ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా  గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్​ ఆరోపించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి.. వ్యాప్తి చెందుతోందని, ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. 

ఇలాంటి స‌మ‌యంలో పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష చేయొచ్చా?  బండి సంజ‌య్ ని ప్ర‌శ్నించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. దిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్‌ చేయాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు 317 జీవో ఇచ్చామని, ఈ జీవో వ‌ల్ల ఏ ఉద్యోగి బాధ‌ప‌డ‌టం లేదని, అని ఉద్యోగ సంఘాలు ఈ జీవోని ఆమోదించాయని అన్నారు. ప్ర‌తి చిన్న విష‌యాన్నితీసుకోని దీక్ష చేయ‌డం స‌రికాద‌ని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Read Also : వారికి అడ్డురాని రూల్స్ .. మాకు ఎందుకు అడ్డుగా మారుతున్నాయి .. Raja Singh ఆగ్ర‌హం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతోంద‌నీ, ఈ సంద‌ర్భంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యి.. కరోనా నిబంధనలు అమ‌లు చేస్తుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఎట్టి ప‌రిస్థితుల్లో  ర్యాలీలు, స‌మావేశాలు నిర్వ‌హించరాద‌ని కేంద్రం హెచ్చరించింది  క‌రోనా విజృంభ‌న ప‌రిస్థితుల్లో దీక్ష చేయ‌డం స‌రికాద‌నీ, క‌రోనా నిబంధ‌న‌లు పాటించే బాధ్యత బీజేపీ నేతలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి పెరిగితే ఎవరు బాధ్యులు అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలు విధించట్లేదా? అని గంగుల ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు.

Read Also : ఉద్యమంలో లేనోళ్లు ఇప్పుడు ఉద్యోగాలని డ్రామాలాడుతున్నరు - ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్

కరీంనగర్‌ పోలీసులను అభినందిస్తున్నట్లు గంగుల తెలిపారు. నిజంగా దీక్ష చేయాలంటే.. ముంద‌స్తుగా అనుమ‌తి తీసుకోవాలి కాదా? సమూహం లేకుండా బండి సంజయ్‌ దీక్ష చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. అస‌లు దీక్ష చేయాల్సింది తెలంగాణలో కాదు.. డిల్లీలో చేయాల‌ని,  అలా చేస్తే.. తెలంగాణాలో అంద‌రూ  సంతోషిస్తార‌ని అన్నారు. ప్ర‌ధాని మోడీ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌న్న ఇప్ప‌టి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌లేద‌నీ. ప్ర‌ధాని ఇంటి ముందు చేయాల‌ని, అలా దీక్ష చేస్తే.. హ‌ర్షం వ్య‌క్తం చేస్తామ‌ని అన్నారు. 

click me!