Bandi Sanjay దీక్ష భ‌గ్నం.. గ్యాస్ క‌ట్ట‌ర్ తో గేట్‌ను కట్ చేసిన పోలీసులు

By Rajesh KFirst Published Jan 2, 2022, 11:48 PM IST
Highlights

ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెరాస‌ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ర‌ద్దు డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay తలపెట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తీవ్ర నాట‌కీయ ప‌రిణామ మ‌ధ్య  గ్యాస్‌ కట్టర్‌తో కార్యాలయ తాళాలు పగులగొట్టి.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌ను మానుకొండుర్ పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు
 

Bandi Sanjay: తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీవో నెం. 317 ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు Bandi Sanjay చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బండి సంజయ్‌ దీక్ష‌కు అనుమ‌తి లేద‌ని అడ్డుకున్నారు. తీవ్ర నాట‌కీయ ప‌రిణామ మ‌ధ్య  గ్యాస్‌ కట్టర్‌తో కార్యాలయ తాళాలు పగులగొట్టి.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ అరెస్టుతో ఎంపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పోలీసులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జ‌రిగింది. ప‌లు కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. ఈ ప‌రిస్థితుల న‌డుమ‌ బండి సంజ‌య్ ను మానకొండూర్​ పీఎస్​కు తరలించారు. 

ఈ క్ర‌మంలో బండి సంజ‌య్ మాట్లాడుతూ.. జైలు లో కూడా  దీక్షను కొనసాగిస్తున్నాని ప్ర‌క‌టించారు. పోలీసులు.. ప్ర‌భుత్వ‌ గుండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతకు ముందు తమ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్ర‌భుత్వ  ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 

Read Also:వారికి అడ్డురాని రూల్స్ .. మాకు ఎందుకు అడ్డుగా మారుతున్నాయి .. Raja Singh ఆగ్ర‌హం

క‌రీంన‌గ‌ర్ పోలీసుల తీరును ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని.. ప్ర‌జాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూడా.. ప్ర‌తిప‌క్షాల‌కు లేదా అని ప్ర‌శ్నించారు. ఈ చ‌ర్య అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈ క్ర‌మంలో  కార్యకర్తలపై లాఠీఛార్జి చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఈ చ‌ర్య‌ను ప్ర‌భుత్వం త‌ప్పుకుండా  మూల్యం చెల్లించుకుంటుంద‌నీ.. ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.


బండి సంజ‌య్ చేప‌డుతున్న జాగరణ దీక్షకు అనుమ‌తుల్లేవ‌ని, కరోనా కారణంగా భారీ ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతిలేదన్న కరీంనగర్‌ సీపీ అన్నారు. బండి సంజయ్‌ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. పోలీసులపై ఎదురు దాడి చేసినందుకు సంజయ్‌పై కేసు నమోదు చేశామని,కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, పోలీస్‌ విధులకు ఆటంకం కలిగించినందుకు  ఇప్పటివరకు 170 మందిని అరెస్టు చేశామని కరీంనగర్‌ సీపీ స‌త్య‌నార‌య‌ణ తెలిపారు.

click me!