బండి సంజయ్ యాత్రలో కిరాయి గుండాలు : మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 23, 2022, 04:48 PM IST
బండి సంజయ్ యాత్రలో కిరాయి గుండాలు : మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

బండి సంజయ్ యాత్రలోకి వేలమంది కార్యకర్తలను తీసుకొస్తున్నారని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మిగతా జిల్లాల నుంచి ఎందుకు గూండాలను తరలిస్తున్నారని దయాకర్ రావు ప్రశ్నించారు. యాత్ర పేరుతో మతచిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై స్పందించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ యాత్రలోకి వేలమంది కార్యకర్తలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. యాత్రలోకి కిరాయి గూండాలని తీసుకొస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. మిగతా జిల్లాల నుంచి ఎందుకు గూండాలను తరలిస్తున్నారని దయాకర్ రావు ప్రశ్నించారు. యాత్ర పేరుతో మతచిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 

ఇకపోతే.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరంగల్ పోలీసులు మంగళవారం నాడు నోటీసులు పంపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు. పాదయాత్రలో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ యాత్ర ఇలానే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

ALso REad:కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతరును సస్పెండ్ చేయాలి: బండి సంజయ్

ఇదిలావుండగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి. కవిత ఇంటి ముందు ధర్నాకు నిన్న బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీంతో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బండి సంజయ్ ను కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. అయితే తాను ఎక్కడ పాదయాత్ర నిలిపివేశానో అక్కడి నుండే పాదయాత్రను ప్రారంభిస్తానని కూడా కరీంనగర్ లో బండి సంజయ్ ప్రకటించారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర చేసే రూట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున పాదయాత్రను విరమించుకోవాలని కూడా ఆ లేఖలో ఏసీపీ బండి సంజయ్ ను కోరారు. పాదయాత్రను ఇక్కడే విరమించుకోవాలని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు