టీడీపీయే పోయింది.. ఆంధ్రా పార్టీలు ఇక చెల్లవు: షర్మిల రాజకీయంపై ఎర్రబెల్లి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 13, 2021, 05:37 PM IST
టీడీపీయే పోయింది.. ఆంధ్రా పార్టీలు ఇక చెల్లవు: షర్మిల రాజకీయంపై ఎర్రబెల్లి వ్యాఖ్యలు

సారాంశం

వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలను స్వాగతించడం లేదన్నారు. టీడీపీ పరిస్ధితి కూడా అలాగే అయ్యిందని ఎర్రబెల్లి గుర్తుచేశారు.

వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలను స్వాగతించడం లేదన్నారు. టీడీపీ పరిస్ధితి కూడా అలాగే అయ్యిందని ఎర్రబెల్లి గుర్తుచేశారు.

కొత్త పార్టీలు తెలంగాణలో చాలా వచ్చాయని.. అయితే సక్సెస్ కాలేదని తెలిపారు మంత్రి . మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ పార్టీలే ఇక్కడి రాజకీయాలకు పేటెంట్ అన్నారు.

Also Read:షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా, కారణమిదే..!!

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం అసాధ్యమని తెలిపారు. గతంలో పార్టీలు పెట్టిన సినిమా స్టార్లు ఏమైపోయారో గుర్తుంచుకోవాలని తెలిపారు శ్రీనివాస్ గౌడ్.  70 ఏళ్ల సమైక్య పాలనలో పీడ పోయిందని ప్రస్తుతం ప్రజలు సంతోషంగా వున్నారని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు గ్రామగ్రామానికి అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఆరు సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో భారతదేశంలోని చాలా రాష్ట్రాలు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!